అది ఉంటేనే అమెరికా రానిద్దాం

ప్రతిభ ఉన్న వారిని మాత్రమే ఇక’పై అమెరికా దేశం లో జాబ్స్ చేసేందుకు రానిస్తారా అంటే ప్రస్తుతం ఆ దేశ  అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు అలానే వున్నాయి . తాజా గా జరిగిన మొదటి కాంగ్రెస్ సమావేశం లో అయన మాట్లాడుతూ ఇకపై అమెరికా దేశానికీ ప్రతిభనైపుణ్యం ఉన్న వారిని మాత్రమే రానివ్వడం మంచిదని అన్నారు ,ఇప్పటికే ఆస్ట్రే లియా , కెనడా వంటి దేశాల్లో ఈ విధానం అమల్లోవుందని అమెరికా లో కూడా ఈ విధానాన్ని ప్రవేశ పెట్ట డం ద్వారా  ఉపాధి అవకాశలుపెరగడం తో పాటు వేల డాలర్లు ఖర్చు ని అరికట్టు కోవచ్చు అని అన్నారు , అమెరికా మాజీఅధ్యక్షుడు అబ్రహం లింకన్ చెప్పిన మాటలని మనం తలకి ఎక్కించు కోవాలని అన్నారు , నైపుణ్యం లేని వారిని తలకెక్కించుకోవడంద్వారా కష్టాలు తప్ప ఉపయోగం లేదని  మెరిట్ బేస్డ్ ఇమ్మిగ్రేషన్ సిస్టం తీసుకురావడమే మంచిదనే అభిప్రాయాన్ని స్పష్టం చేసారు , ఈ విధానం కేవలం అమెరికన్స్ కి మాత్రమే కాదు వలస వచ్చిన ఇతర దేశాల వారికీ కూడా లాభం అని అన్నారు , మొత్తం గా తన లక్ష్యం మిలియన్ ఉద్యోగాలను సృష్టించ డమే  అని అన్నారు , ట్రంప్ దూకుడుచూస్తే అమెరికా వెళ్ళాలి అనుకొనే  ఇండియన్స్ ఆశల్ని ఆవిరిచేసినట్టే కనిపిస్తోంది . ఇకపై అమెరికా వెళ్ళడం  ఈజీ కాదనే విషయం క్లియర్ ..

]]>