అన్నకు తమ్ముడి బహుమతి….

కాటమరాయుడు సినిమా షూటింగ్ లో పవన్ కు సర్‌ ప్రైజింగ్ గిఫ్ట్ అందించాడు శివబాలాజీ.బంగారపు రంగులో ఉన్న కత్తి ని ఒక స్కార్ఫ్ లో కట్టి ప్రెసెంట్ చేసాడు.దాని ఓపెన్ చేసి చుసిన పవన్ చాలా సంతోషిచారు.కత్తిపై రెండు వైపుల జనసేన పేరు తెలుగు,హిందీ భాషల్లో రాసుంది. ‘పవిత్రాయ సాధునాం… ’అనే శ్లోకం కూడా కత్తిపై రెండు వైపులా లిఖించారు. కత్తి పిడి దగ్గర జనసేన లోగోను పొందుపరిచారు. శివబాలాజీ ఇచ్చిన కానుకను కాటమరాయుడు బృందంలోని వారంతా ఆసక్తిగా తిలకించారు.‘కాటమరాయుడు’లో నలుగురు తమ్ముళ్లకు అన్నయ్యగా పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. నలుగురు తమ్ముళ్లలో ఒకడిగా శివబాలాజీ నటిస్తున్నాడు.

]]>