ప్రధాని నరేంద్ర మోడీ తలపెట్టిన నగదురహిత సమాజం కోసం ఇప్పుడు మరో కొత్త యాప్ ని వినియోగదారుల ముందుకు తీసుకువచ్చారు.’ఆధార్ పే’ యాప్‌ను ప్రభుత్వం లాంచ్ చేసింది.సరళమైన పద్దతుల్లో లావాదేవీలు చేసుకోవడానికి ఈ యాప్ పనిచేస్తుంది.ఈ క్రింది సూచనలు సలహాలు ఉపయోగించుకొని ఈ యాప్ ని వాడుకోవచ్చు.నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్సీపీఐ), యూఐడీఏఐలు కలిసి ఆధార్ పే యాప్‌ను రూపొందించాయి.
1. బ్యాంకు ఖాతాలతో ఆధార్ నంబర్‌ను అనుసంధానిస్తేనే ఆధార్ పే యాప్‌ను వినియోగించడానికి వీలుకలుగుతుంది. 2. ఆధార్ పే ద్వారా చెల్లింపులు జరిపేందుకు సదరు వ్యక్తి వేలి ముద్ర(బయోమెట్రిక్ పద్దతి) ఇవ్వాల్సివుంటుంది. 3. యాప్ ని వినియోగించడం వల్ల క్రెడిట్/డెబిట్ కార్డుల కంపెనీలకు చెల్లించాల్సిన మొత్తం ఆదా అవుతుంది. 4. యాప్‌ను వినియోగించేందుకు వినియోగదారునికి మొబైల్ ఉండాల్సిన అవసరం లేదు. వ్యాపారి మాత్రం మొబైల్‌ను కచ్చితంగా వినియోగించాలి. 5. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆధార్ పే యాప్, బయోమెట్రిక్ స్కానర్ యాప్‌లను ఇన్స్టాల్ చేసుకుని ఒకదానితో మరొకదాన్ని అనుసంధానించుకోవాల్సి ఉంటుంది. వినియోగదారుడు లావాదేవీ జరపడానికి వచ్చినప్పుడు వ్యక్తి ఆధార్ నంబర్‌ను ఆధార్ పే యాప్‌లో టైప్ చేసి బయోమెట్రిక్ స్కానర్‌లో ఫింగర్ ప్రింట్‌ను తీసుకోవాలి. 6. కేవలం కొనుగోళ్లు జరపడానికి మాత్రమే ఆధార్ పే యాప్ ఉపయోగపడుతుంది. మనీ ట్రాన్స్ఫర్లను ఈ యాప్ ద్వారా నిర్వహించలేం. 7. ప్రస్తుతం రూ.10వేల వరకూ ఆధార్ పే ద్వారా లావాదేవీలు జరపొచ్చు.
]]>