ఇద్దరు హీరోయిన్స్ తో "మిస్టర్"

ల‌క్ష్మి న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్‌పై బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రుణ్‌తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి, హెబ్బా ప‌టేల్ హీరో హీరోయిన్లుగా న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్‌(బుజ్జి), ఠాగూర్ మ‌ధు నిర్మాత‌లుగా శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `మిస్ట‌ర్‌`.మార్చ్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

డైరెక్టర్ మాట్లాడుతూ `మిస్ట‌ర్‌` వంటి క‌థ‌ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే మంచి ఎమోష‌న్స్‌కి, హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైనింగ్‌కి, మ్యూజిక్‌కి, విజువ‌ల్స్‌కు స్కోప్ ఉన్న క‌థ‌.ఏదైతే అనుకున్నానో దాన్ని హండ్రెడ్ ప‌ర్సెంట్ ఎలాంటి కాంప్ర‌మైజ్ లేకుండా తీయ‌గ‌లిగాను. అందుకు నా నిర్మాత‌ల‌కు,న‌టీన‌టుల‌కు, టెక్నిషియ‌న్స్‌కు థాంక్స్.

mister

ఈ చిత్రం లో ప్రిన్స్‌,నాజ‌ర్‌, ముర‌ళీశ‌ర్మ‌, త‌నికెళ్ళ‌భ‌ర‌ణి, చంద్ర‌మోహ‌న్‌, ర‌ఘుబాబు, ఆనంద్‌, పృథ్వీ, శ్రీనివాస్‌రెడ్డి, స‌త్యం రాజేష్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, నాగినీడు, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, నికిత‌న్‌ధీర్‌, ష‌ఫీ, శ్ర‌వ‌ణ్‌, మాస్ట‌ర్ భ‌ర‌త్‌, షేకింగ్ శేషు, ఈశ్వ‌రిరావు, సురేఖావాణి, స‌త్య‌కృష్ణ‌, తేజ‌స్విని త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ఆర్ట్ః ఎ.ఎస్‌.ప్రకాష్‌, స్టైలింగ్ః రూప వైట్ల‌, లిరిక్స్ః కె.కె, రామ‌జోగ‌య్య శాస్త్రి, కోడైరెక్ట‌ర్స్ః బుజ్జి, కిర‌ణ్‌, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్ః కొత్త‌ప‌ల్లి ముర‌ళీకృష్ణ‌, క‌థః గోపీ మోహ‌న్‌, మాట‌లుః శ్రీధ‌ర్ సీపాన‌, సంగీతంః మిక్కి జె.మేయ‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీః కె.వి.గుహ‌న్‌, ఎడిట‌ర్ః ఎం.ఆర్‌.వ‌ర్మ‌, నిర్మాత‌లుః న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్‌(బుజ్జి), ఠాగూర్ మ‌ధు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః శ్రీనువైట్ల‌.

]]>