కాటన్ చొక్కా,ఎర్రటితుండుతో కాటమ రాయుడు

మంగళగిరి లోని చేనేత సత్యాగ్రహ కార్యక్రమానికి కాటన్ చొక్కా మెడలో ఎర్రటి కండువాతో వచ్చిన జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ఇది గబ్బర్ సింగ్ డ్రెస్ కాదు మన నేతన్న నేసిన నూలు చొక్కా ,తుండు అంటూ ఉద్వేగభరితం గా ప్రసంగించారు ,కేవలం ప్రజల కోసమే తానూ రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు , జన సేనకి కూడా నాయకుల అవసరం వుందని ,స్వంత పార్టీ నాయకులని కూడా ప్రస్నిస్తానని అన్నారు , అంతిమంగా పేదలకి న్యాయం జరగాలని తన ఆకాంక్ష అని అన్నారు. ప్రజా సమస్యల కోసం పోరాడే నాయకులూ కావాలని అలంటి నాయకుల్ని ఎన్నుకోవలసిన బాధ్యత తన మీద వుందని ఆ అన్వేషణ లో వున్నట్టు చప్పుకోచారు తన పార్టీ కి యువతే ఊపిరి అని అన్నారు , వారసత్వ రాజకీయాల వల్ల ఉపయోగం లేదని పరోక్షం గా ప్రతిపక్ష ,అధికార పక్ష నాయకుల వారసులని ఉద్దేశించి అన్నట్టున్నారు. మొత్తానికి జనసేన కేవలం ప్రజలకోసం అనే నినాదాన్ని తీసుకెళ్ళే ప్రయత్నం చేసారు పవన్ కళ్యాణ్

]]>