జుట్టు ఊడిపోతోందా…ఈ చిట్కాలు ట్రై చేయండి …

హెయిర్ ఫాల్ తగ్గించుకోవడానికి ఉల్లి రసం ఉపయోగపడుతుంది: ఉల్లిపాయలో ఉండే ఘాటైన సల్ఫర్ జుట్టు పెరగడానికి బాగా సహకరిస్తుంది.తలలోని ఇన్ఫెక్షన్లను,చుండ్రును పోగొట్టడానికి ఇదొక అద్భుతమైన టిప్. ఉల్లిని ఎలా ఉపయోగించాలో దీని ఉపయోగాలను ఈ క్రింది వివరాలలో చుడండి:

**గుడ్డులో ఉల్లిపాయ రసాన్ని కలిపి, తడి జుట్టు మీద అప్లై చేయాలి ఒక అరగంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. **ఉల్లిపాయ రసానికి నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించడం వల్ల చుండ్రు పోయి జుట్టు మంచి పెరుగుదల ఉంటుంది. **ఉల్లిపాయ రసం లో పెరుగు కలిపి తలకు మసాజ్ చేయాలి.కాసేపు ఆగి తల స్నానం చేస్తే జుట్టు పెరగడం తో పటు హెయిర్ మంచి షైన్ అయ్యి సిల్కి గా ఉంటుంది.

coconut **కొబ్బరి నూనెలో ఉల్లిపాయ రసాన్ని కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ** అరటి పండు గుజ్జులో ఉల్లిపాయ రసాన్ని మిక్స్ చేసి, తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. **ఉల్లిపాయలో ఎక్కువ శాతం సల్ఫర్ ఉంటుంది. సల్ఫర్ రక్త ప్రసరణను పెంచి, వెంట్రుకలకు శక్తిని ఇస్తుంది. ఉల్లిపాయను పేస్ట్ చేసి తలకు రాయడం లేదా ఏదైనా ఇతర హెయిర్ ప్యాక్ లతో ఈ పేస్ట్ ను కూడా కలిపి తలకు పట్టించాలి. ఇలా చేయడానికి అరగంట ముందు తలకు హాట్ ఆయిల్ మసాజ్ చేయాలి.ఇలా చేస్తే తలా లో ఉండే ఇన్ఫెక్షన్స్ పోయి జుట్టు పెరుగుతుంది.

]]>