నా రాజీనామా……రుమానా అహ్మద్

రుమానా అహ్మద్, ట్రంప్ పదవి బాధ్యతలు చేపట్టిన 8 రోజుల్లోనే ఉద్యోగం మానేశారట, వైట్ హౌస్ లో బురఖాలో కనిపించే ఏకైక ముస్లిం ఉద్యోగిని తానేనని.. అక్కడ సేఫ్ కాదని భావించి ఉద్యోగానికి రాజీనామా చేశానని చెప్పారు.ఫస్ట్ నుంచి తాను భయపడుతూనే ఉందట ట్రంప్ బాధ్యతలు చేపడితే ఇలాంటిది ఏదో అవుతుంది బయపడినట్లే జరిగింది అని చెప్తున్నారు.

రుమానా అహ్మద్:

‘మా పేరేంట్స్ 1978లో బంగ్లాదేశ్ నుంచి అమెరికాకు వలస వచ్చారు. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందాను.మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి ఎంతో స్ఫూర్తి పొందిన నేను 2011లో వైట్ హౌస్ లో జాబ్ సంపాదించాను.అదే విధంగా జాతీయ భద్రతా మండలి(ఎన్ఎస్‌సీ)లోనూ పని చేశాను.ఉద్యోగానికి ఎప్పుడూ నేను బురఖా ధరించే వెళ్లేదాన్ని.ఒబామా ప్రభుత్వంలో నాకెలాంటి ఇబ్బందులు లేదు.అయితే కొత్త అధ్యక్షుడు ట్రంప్ ముస్లింలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు.దీంతో ఏం చేయాలో పాలుపోక ఉద్యోగం వదులు కోవాల్సి వచ్చిందని.

జాబ్ మానేస్తున్నానని ఉన్నతాధికారులకు చెబితే..జాబ్ ఒక్కటే మానేస్తున్నావా..దేశం నుంచే వెళ్లిపోతున్నావా అని అడిగారని వెల్లడించారు.గతేడాది ఎన్నికల సమయం నుంచి అమెరికాలోని ముస్లింలు తమ పరిస్థితి ఎలా ఉండబోతుందని ఎంతో ఆందోళన చెందుతున్నారని, ఇప్పుడు మా ఆందోళనే నిజమైందని ఆమె చెప్పారు.ముస్లింలను దేశంలోకి రాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్న ట్రంప్..అధ్యక్ష అధికార భవనం శ్వేతసౌధంలో బురఖా ధరించి కనిపించే తనపై తప్పకుండా వేటు వేస్తారని భావించి స్వయంగారాజీనామా చేశానని రుమానాఅహ్మద్ వాపోయారు   .house

]]>