నిజమైన "ప్రేమ"……

“ప్రేమ” ఇది ఎంతటి వారినైనా మంత్ర ముగ్దుల్ని చేస్తుంది.అందుకే అంటుంటారు ప్రేమలో పడిన వాడు గుడ్డి వాడి తో సమానం అని ప్రేమించిన వాళ్ళు చెప్పేమాట నా కళ్ళ తో చూడమని,ఇప్పుడు మనం కూడా సోఫియన్ కళ్ళతో తన ప్రియురాలి మార్తా పొటు ని చూద్దాం.ప్రేమంటే ఇంఫ్యాక్చవేషన్ ప్రేమంటే అట్రాక్షన్ అనుకునే ఈ రోజుల్లో అవన్నీ అబద్దాలు ప్రేమంటే ప్రేమే అని రుజువు చేసాడు సోఫియన్.

ఓ కొత్త, వింతైన ప్రేమకథ ఇండోనేసియాలో వెలుగుచూసింది.మాంటెహేగ్‌కు చెందిన సోఫియన్ లోహో డాండెల్ (28)కు ఓ రోజు అపరిచిత వ్యక్తిని నుంచి ఫోన్ వచ్చింది. ఓ మహిళ మాట్లాడింది. ఆలా వచ్చిన ఫోన్ కాల్ వీరిద్దరిని దగ్గరకు చేసింది. ఇద్దరూ తరచూ మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో సోఫియన్ ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరు ఒకరి గురించి తెలుసుకున్నారు. అయితే ఆమె వయసు గురించి సోఫియన్ ఆరా తీయలేదు. కొన్ని నెలలు ఇలా గడిచిన తర్వాత సోఫియన్ తన ప్రేయసిని కలవాలని,దక్షిణ మినహాసాలోని లీలెమా అనే గ్రామంలో ఉన్న ప్రేయసి దగ్గరకు వెళ్లాడు. తాను ప్రేమించిన మహిళ 82 ఏళ్ల వృద్దురాలని తెలుసుకున్న సోఫియన్ తొలుత షాకయ్యాడు. అయితే తమది నిజమైన ప్రేమని, కలసి ఉండాలని, పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు.సోఫియన్ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.

పదేళ్ల క్రితం తన భర్త చనిపోయాడని, వృద్దాప్యంలోకి తనకో తోడు కావాలని కోరుకున్నానని, సోఫియన్ రూపంలో ఓ తోడు దొరికిందని మార్తా చెప్పింది. ఆమె పిల్లలు జర్మనీ, సౌదీ అరేబియాలో స్థిరపడ్డారాని మార్త ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది.

]]>