బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలిసిపోయింది..

ఒక్క ఫొటో అది తెలిసి రిలీజ్ చేశాడో.. లేదా తెలియక రిలీజ్ చేశాడో కానీ దేశాన్ని ప్రపంచాన్ని ఊపేస్తున్న ప్రశ్నకు సమాధానం దొరికిపోయింది. రాజమౌళి అండ్ కో చేసిన చిన్న తప్పు సినిమాలోని పెద్ద మిస్టరీకి సమాధానాన్ని వెతికిపెట్టింది..

బాహుబలి.. బాహుబలి.. తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి చేర్చిన సినిమా.. దేశాన్ని ఊపేసిన సినిమా.. చివర్లో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడని అందరూ జుట్టుపీక్కున్నారు. సినిమా విడుదలయ్యాక అందరి మదిని తొలిచిన ప్రశ్న.. దీనికి సమాధానం ఒక్క రాజమౌళి అండ్ టీం కే తెలుసు కానీ ఎవ్వరూ ఎక్కడ నోరుజారలేదు. సినిమాకు గుండెకాయ లాంటి అంతపెద్ద విషయాన్ని రిలీజ్ చేయడం ఇష్టంలేక మీడియా ఎవ్వరూ చెప్పలేదు. దీంతో సోషల్ మీడియా, సైట్లలో అందరూ బాహుబలిని ఎందుకు చంపాడనే దానిపై పేరడీలు కట్టారు.. రాజకీయ, సినీ జనాలను ఇన్వాల్వ్ చేసి ఎన్నో కార్టున్లు గీశారు. కానీ ఇప్పటికి ఎవ్వరికి బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలియలేదు..

కానీ నిన్న రాజమౌళి రిలీజ్ చేసిన ఒక్క ఫొటోతో ఆ సినిమా స్టోరీ, ముఖ్యంగా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలిసిపోయిందని విశ్లేషకులు ఓ అంచనాకు వచ్చారు.. అసలు బాహుబలి కథను చూస్తే.. పెద్ద బాహుబలిని కట్టప్ప చివర్లో చంపేస్తారు. అంతకుముందు ఏం జరిగిందని ఎవ్వరికీ తెలీదు. ఎందుకు చంపాడో తెలియదు.. కానీ స్టోరీలోకి వెళ్తే..

రాజ్యం కోసం పెద్ద బాహుబలికి-భళ్లాల దేవుడుకి బీకర యుద్ధం జరుగుతుంది. బాహుబలితో నేరుగా తలపడే దమ్ములేని భళ్లాల దేవ దొంగదెబ్బకు ప్లాన్ చేస్తాడు. బాహుబలి భార్య దేవసేన.. అతడి కొడుకు శివుడిని బంధిస్తాడు. వీరిద్దరిని చంపేస్తానని కట్టప్పకు చెబుతాడు.. నువ్ బాహుబలిని చంపితే దేవసేనను, ఆమె కొడుకును వదిలేస్తానని.. ఒక్క ప్రాణం కావాలో.. లేక ఇద్దరి ప్రాణాలు కావాలో తేల్చుకోవాలని కట్టప్పను కోరతాడు. దీంతో విధిలేని పరిస్థితుల్లో కట్టప్ప బాహుబలిని చంపి దేవసేనను, ఆమె కొడుకును కాపడతాడు.. కానీ కపటబుద్ది గల భళ్లాల దేవుడు బాహుబలి చనిపోయాక అతడి వారసుడు శివుడిని చంపాలని చూస్తాడు. దీంతో రమ్యక్రిష్ణ బాహుబలి కొడుకు ను తీసుకొని పారిపోతుంది. ఓ పేద్ద నదిలో బాహుబలి కొడుకుతో ప్రయాణిస్తూ చనిపోయి బాలుడిని బతికిస్తుంది. ఇది మనం బాహుబలి సినిమా మొదలవగానే కనిపిస్తుంది.. ఇప్పుడు ఇదే అసలు కథ ..

]]>