షారుక్ ఖాన్ ‘రాయిస్’ ,ఆమీర్ ఖాన్ ‘దంగల్ ‘సినిమాలు ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి.ఇప్పుడు రంగూన్ సినిమా కూడా ఆన్ లైన్ పైరసీ బారిన పడింది.రగున్ సినిమా ఈ నెల 24 న విడుదలయ్యింది మొదటి వారం లో కలెక్షన్ తక్కువ ఉంది.ఇప్పుడు ఈ పైరసీ వల్ల ఇంటర్ నెట్ లో సినిమా మొత్తం వచ్చేస్తోంది దీనితో సినిమా కలెక్షన్ లు మరింత తగ్గే అవకాశం ఉంది.పైరసీదారులను కనిపెట్టే పనిలో చిత్ర యూనిట్ ఉంది.
రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ‘రంగూన్’పై మంచి రివ్యూస్ వచ్చాయి. విలక్షణ దర్శకుడు విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సైప్ అలిఖాన్, షాహిద్ కపూర్, కంగనా రౌనత్ ముఖ్యపాత్రల్లో నటించారు.
]]>