రాఘవ లారెన్స్ నటించిన తాజా చిత్రం ‘శివలింగ’.కొరియోగ్రాఫర్ గా,డైరెక్టర్ గా,హీరో గా తనదైన స్టైల్ లో దూసుకుపోతున్న లారెన్స్ కొత్త చిత్రం ఏప్రిల్‌లో 14న రిలీజవుతోంది. ‘చంద్రముఖి’ వంటి సంచలన చిత్రానికి దర్శకత్వం వహించిన పి.వాసు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ నటించిన ‘శివలింగ’ చిత్రాన్ని అదే టైటిల్‌తో అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి. పిళ్లై నిర్మించారు.‘కాంచన’, ‘గంగ’ ఏ స్థాయిలో విజయాలు సాధించాయో తెలుసు. వాటిని మించిన కథ, కథనాలతో హారర్ ఎంటర్ టైనర్‌గా ‘శివలింగ’ తెరకెక్కింది.హారర్ కాన్సెప్ట్ ల పరంగా ‘శివలింగ’ నెక్ట్స్ లెవెల్లో ఉండే చిత్రమవుతుందాని నిర్మాత పిళ్ళై అన్నారు.
]]>