అమెరికా జనాభా ప్రస్తుతం 32.442 కోట్ల మంది. ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాల్లో మూడో స్థానంలో ఉంది. 81 శాతం మంది పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. 2015 జనాభా లెక్కల ప్రకారం అమెరికన్లలో జాతుల శాతం ఇలావుంది…
శ్వేతజాతీయులు | 61.6% |
నల్ల / ఆఫ్రికా జాతీయులు | 13.3% |
ఆసియా జాతీయులు | 5.6% |
ఆదివాసీ అమెరికన్లు | 1.4% |
ఇతర జాతులు | 0.2% |
హిస్పానిక్ /లాటినో | 17.6% |
రెండు, మూడు జాతులు | 2.6% |

అమెరికా అంటే ప్రతి ఒక్కరికి ముందు గుర్తొచ్చేది ‘లిబర్టస్’ ప్రతిమ.ఈ స్వేచ్ఛ దేవత ని ఫ్రాన్స్ ప్రజలు అమెరికా ప్రజలకు బహుమతిగా ఇచ్చారు.ఈ విగ్రహం 350 భాగాలను అమెరికా కు రవాణా చేసి విడి భాగాలను కలిపి 1886లో న్యూయార్క్లో ‘లిబర్టీ ఐలండ్’లో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు విగ్రహం ఎత్తు151 అడుగులు . ‘1776 జూలై 4’ అనే అక్షరాలు ఆ విగ్రహం చేతిలో ఉన్న పుస్తకం మీద చెక్కివుంటాయి.ఆ రోజే అమెరికా స్వతంత్రం ప్రకటించుకున్న రోజు.ఆ విగ్రహం పాదాల చెంత తెగిపడ్డ సంకెళ్లు ఉంటాయి. ఈమె ‘దేశ బహిష్కృతుల తల్లి’ అని, ఆమె చేతిలోని కాగడా ప్రపంచమంతటికీ స్వాగతం చెప్తోందని అమెరికా కవయిత్రి ఎమ్మా లాజరస్ అభివర్ణించారు.
]]>