వినోద్ ఖన్నా కన్నుమూత….

బాలీవుడ్  స్టార్ హీరో,గురుదాస్ పూర్ నియోజకవర్గం బీజేపీ ఎంపీగా ప్రాతినిద్యం వహిస్తున్న వినోద్ ఖన్నా కన్నుమూశారు.క్యాన్సర్ వ్యాధి తో భాదపడుతూ కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆయన. ఈ మధ్యాహ్నం 12గంటల సమయంలో స్వర్గస్తులైనారు.డీ హైడ్రేషన్ కారణంగా ఆస్పత్రిలో చేరినట్లు ప్రకటించిన ఆయన వారం తిరగకముందే,మృతి చెందడం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. సినీలోకం శోకసంద్రం లో మునిగి పోయింది.2002లోనూ వాజ్ పాయ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేశారు.1968లో సినీ రంగ ప్రవేశం చేసి.విలన్ గా అరంగేట్రం చేసినా,తన విలక్షణమైన నటనతో ఆ తర్వాత హీరోగా మారారు. 141 సినిమాల్లో నటించారు. ఆయన చివరి చిత్రం దిల్ వాలే.ఆయన మరణం వార్త విని హిందీ సిని ఇండస్ట్రి కన్నీరు మున్నీర్ అవుతుంది.పలువురు  ప్రముకులు వినోద్ ఖన్నా కునివాళులు అర్పించారు.

]]>