వెండితెర పై….'బిత్తిరి సత్తి'

“సావిత్రక్క మంచిగున్నవా గేంది గుస్సాయిస్తున్నావ్” …..అంటూ అచ్చమైన తెలంగాణ యాసలో అందర్నీ నవ్విస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న బిత్తిరి సత్తి.ఉదయాన్నే తెలంగాణ న్యూస్ ఛానెల్ “తీన్ మార్ ముచ్చట్లు” లో హాయ్ చెప్తాడు కదా……ఆ బిత్తిరి సత్తి ఇక పై బుల్లి తెరకి దూరం అవుతాడేమో.ఎందుకంటె ఆయనకి మంచి మంచి సినిమా ఆఫర్స్ వస్తున్నాయి.”విన్నర్”మూవీ లో తన కామిడి ఒక రేంజ్ లో పండింది.దీనితో ఆయనకి భారీ గా అవకాశాలు వస్తున్నయి.

బిత్తిరి సత్తిగా న‌వ్విస్తోన్న ఆయ‌న‌ అసలు పేరు చేవెళ్ల రవి. ఆయన రంగారెడ్డి జిల్లా పమేనా గ్రామానికి చెందిన వాడు.గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రానున్న ‘గౌతమ్ నంద’ సినిమాలోనూ సత్తి పూర్తి స్థాయిలో క‌నిపించ‌నున్నాడు. ఇంకా చాల సినిమా అవ‌కాశాలు ఇప్పుడు ఆయ‌న ముందు ఉన్నాయి.

]]>