"శరణం గచ్చామి" ఆడియో విడుదల చేసిన కెటిఆర్

రిజర్వేషన్ వ్యవస్థ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం”శరణం గచ్చామి” ని సెన్సార్ బోర్డు రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే .ఈ విషయం పై చిత్ర దర్శకుడు ప్రేమ్ రాజ్ పోరాడి తెలంగాణ ప్రభుత్వం సహకారంతో త్వరలో విడుదల చేయనున్నారు.బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై మురళి బొమ్మకు నిర్మిస్తూ కథ-స్క్రీన్ ప్లే సమకూర్చిన చిత్రం. ఈ చిత్రం ఆడియో ని తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు విడుదల చేసారు ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీయార్ మాట్లాడుతూ.. “తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో నిరాశతో ముందడుగు వేయలేకపోతున్న మా తెలంగాణ వాదులందరికీ తన సాహిత్యంతో స్ఫూర్తినిచ్చిన వ్యక్తి దర్శకుడు ప్రేమ్ రాజ్. నాతో ఎంతో సాన్నిహిత్యం ఉన్నప్పటికీ ఇప్పటివరకూ ఎప్పుడు నా సహాయం తీసుకోలేదు. అటువంటి వ్యక్తి ఒక మంచి ఆశయంతో తెరకెక్కించిన “శరణం గచ్చామి” చిత్రానికి ఆయన అడగకున్నా ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని రకాల అండదండలూ, మద్దతు నేను అందిస్తాను. ట్యాక్స్, సబ్సిడీ వంటి విషయాల్లో నేను పర్సనల్ కేర్ తీసుకొంటాను. ఈ సినిమా మంచి విజయం సాధించి ఇలాంటి మరిన్ని చిత్రాలు రూపొందడానికి ఊతమివ్వాలని ఆశిస్తున్నాను” అన్నారు.

]]>