'సమంత' ఏడేళ్ళ అనుభవాలు…..

సమంత తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఈ రోజుకి సరిగ్గా ఏడేళ్లు అవుతోంది.ట్విట్ట‌ర్ ద్వారా తన7 ఏళ్ళ అనుభవాలను పంచుకుంది.కష్టాలు, అపజయాలు, విచారం, స‌క్సెస్‌, మంచి పేరు రావ‌డం,సంపద ఇలా ఎన్నో అనుభ‌వాలు ఈ ఏడేళ్ళలో ఎదుర‌య్యాయ‌ని చెప్పింది.సాధారణంగా జీవించడం ఎలాగో ఈ ఏడేళ్ల కాలంలోనే తెలిసిందని.సంతోషంగా జీవించడం అనేది అంత సామాన్యమైన విషయమేం కాదని పేర్కొన్న స‌మంత‌… సమస్య వచ్చిన ప్రతిసారీ త‌న‌కు హార్ట్ ఎటాక్ రాదని, తాను చ‌నిపోనని అంటోంది.సినీ జీవితం త‌న వ్య‌క్తిగ‌త‌ జీవితంలోకి కొందరిని పరిచయం చేసిందని.త‌న‌కు సినీ జీవితం ఒక‌ వరం అని సినీ పరిశ్రమ ఎంతో మంది ప్రేక్ష‌కుల‌ ప్రేమను త‌న‌కు ఇచ్చిందని తెలిపింది. చివ‌ర‌గా అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ,త‌న అభిమానుల‌ను ఎప్పటికీ ప్రేమిస్తుంటాను అంటోంది సమంత.

]]>