"జనతా హోటల్ "ఫస్ట్ లుక్ పోస్టర్..

మహేష్ కొండేటి సమర్పణలో ఎస్.కె.పిక్చర్స్ సంస్థలో,దుల్కర్ సల్మాన్, నిత్య మీనన్ జంటగా తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్న చిత్రానికి ” జనతా హోటల్ ” అనే పేరును ఖరారు చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను మహా శివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకొని సూపర్ స్టార్ కృష్ణ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ – సురేష్ కొండేటి తెలుగులో చాలా మంచి చిత్రాల్ని నిర్మించారు. ఇప్పుడు తీస్తున్న జనతా హోటల్ కూడా మంచి విజయాన్ని సాధించాలని మనసార కోరుకుంటున్నాను.

ఈ సందర్భంగా సురేష్ కొండేటి మాట్లాడుతూ – జర్నలిస్టుగా నా కెరీర్ ను స్టార్ట్ చేసింది కృష్ణగారి ప్రత్యేక సంచికతోనే. ఈ రోజు మహా శివరాత్రి పర్వదినాన ఆయన చేతులు మీదగా ఫస్ట్ మోషన్ పోస్టర్ ని లాంచ్ చేయడం ఆనందంగా ఉంది.నా గత చిత్రాలు ప్రేమిస్తే, పిజ్జా, జర్నీ సినిమాలు లానే చక్కటి సినిమా అవుతుంది అని ఆశిస్తున్నా…

మనిషి ఏది ఇచ్చిన ఇంకా ఇంకా కావాలన్పిస్తుంది…ఒక్క భోజనం విషయంలో కడుపు నిండగానే చాలు అనిపిస్తుంది ..ఇలాంటి మంచి పాయింట్ తో తీసిన సినిమా ఇది. ఇటివలె సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. మార్చి నెలాఖర్లో కాని ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

]]>