జూన్ నుంచి చెలామణి కానున్న 200 నోటు

పాత నోట్ల రద్దు తర్వాత పెద్ద నోట్లైన 2000,5oo రూపాయలతో చిల్లర కష్టాలు మొదలయ్యాయి ఈ సమస్య ను ద్రుష్టి లో పెట్టుకున్న అర్ బి ఐ 200 నోట్లు తీసుకు రావాలంటూ కార్యదర్శుల భేటీలో ఆలోచనలు చేసిన విషయం తెలిసిందే,ఇపుడు అధికారికం గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI). కొత్తగా రూ.200 నోటును జూన్ నుంచి ప్రవేశపెట్టబోతున్నట్టు ప్రకటించింది.కొత్త రూ.200 నోటును ATMలలో కాకుండా బ్యాంకుల ద్వారా మాత్రమే సరఫరా చేయనున్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న 2 లక్షల 20వేల ATMల ద్వారా కొత్త నోట్ లను లోడ్ చేయడానికి, రవాణాకు రెండు నెలల సమయం పడుతుందని,ఆ ఆలస్యాన్ని నివారించేందుకు.ATMలలో కాకుండా బ్యాంకుల ద్వారానే కొత్త రూ.200 నోట్లను చెలామణిలోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలిపారు బ్యాంకు అధికారులు.నోట్ల మార్పిడి కోసం రోజులకొద్దీ.గంటలపాటు బ్యాంకు, ఏటీఎంల దగ్గర క్యూలైన్ లలో నిలుచొని,అవస్థలు పడకుండా,ప్రజల దగ్గరకే కొత్త నోటు చేర్చే ఆలోచనలలో అధికారులు ఉన్నారు .

]]>