త్వరలో వాడుకలోకి రానున్న 200 నోటు…

పాత నోట్ల రద్దు తర్వాత 2000,5౦౦  రూపాయల నోట్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.దీని తో నోట్ల కొరత బాగా ఏర్పడింది.ఈ విషయాన్నీ ద్రుష్టి లో పెట్టుకున్న RBI.కొత్తగా రెండు వందల రూపాయల నోట్లను వాడుకలకోకి తెచ్చే ప్రయత్నాలలో ఉంది. చిన్న నోట్ల కొరత కొనసాగుతుండడంతో రిజర్వు బ్యాంకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.జాతీయ పత్రిక ఎకనమిక్స్ టైమ్స్ కథనం ప్రకారం.కేంద్రం ఆమోద ముద్రవేస్తే.నోట్ల ప్రింటింగ్ ను ప్రారంభిస్తామంటున్నారు RBI అధికారులు. 2017, జూన్ తర్వాత నుంచి వీటి ముద్రణ ప్రారంభం కానుందని రిజర్వ్ బ్యాంక్ అధికారుల సమాచారం.మార్చి నెలలో ఫీల్డ్ వర్క్ చేసిందట RBI. 10 రూపాయల నోటును ప్లాస్టిక్ రూపంలో తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా సమాచారం. అధికారికంగా మాత్రం వీటిపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు రిజర్వ్ బ్యాంక్. రూ.200 నోటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. 2వేల నోటు రద్దవుతుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.

]]>