రణవీర్ అచ్చం కపిల్ లాగే ఉన్నాడు

Ranavir kapildev
Ranavir kapildev

1983 లో ఇండియా వరల్డ్ కప్ ను గెలుచుకున్న విషయం తెలిసిందే. లార్డ్స్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇండియా వెస్ట్ ఇండీస్ పై ఘనవిజయం సాధించి కప్ ను అందుకుంది.ఈ మెమొరబుల్ ఈవెంట్ ఇప్పుడు ’83’ పేరుతో సినిమాగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. హిందీ లో కబీర్ ఖాన్ దర్శకత్వంలో రూపొందుతోంది . కపిల్ దేవ్ పాత్రలో  రణవీర్ సింగ్ నటిస్తున్నారు. దీపికా పదుకొనె కథా నాయిక.  రణవీర్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ఈ సినిమాలోని ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కపిల్ దేవ్ లుక్ లో రణవీర్ సెట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లండన్ లో జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకి తీసుకు రాబోతున్నారు. కపిల్ దేవ్ గెటప్ లో రణవీర్ సింగ్ ను చూసిన అభిమానులు కపిల్ దేవ్ ని చూసినట్టే వుంది అంటున్నారు.