మనోహర్ పారికర్ @ నిజాయతి !

తాజా ఎన్నికల ఫలితాల అనంతరం కొన్ని రాష్ట్రాల్లో ఫలితాలు హంగ్ దిశగా వెళ్లిన సంగతి తెలిసిందే ఐతే గోవా  రాష్ట్రము లో మాత్రం రాత్రికి రాత్రే సమీకరణాలు మారి పోయాయి ఎందుకు ?. ముఖ్య మంత్రి అభ్యర్థి గా మనోహర్ పారీకర్ కావా లని డిమాండ్ రావడం చూస్తే అయన కున్న ఫాలోయింగ్  ఏంటో ఇట్టే అర్ధ అవుతుంది, అయన గురించి క్లుప్తం గా తెలుసుకుందాం.

కాబోయే  ముఖ్యమంత్రి  మనోహరు పారికర్  వ్యక్తిత్వం…ఇదే

గోవా లో ఒక ట్రాఫిక్ సిగ్నల్ పడింది ఆది చూసి  బైక్ నడుపుతున్న వ్యక్తి బండి ఆపేసాడు. వెనుకగా ఒక కార్ వచ్చింది ఒకటే హార్న్ కొడుతూ దారి ఇవ్వమని అడిగాడు. స్కూటర్ పైన ఉన్న వ్యక్తి రెడ్ లైట్ చూపాడు. .నాకు తెలుసులే నువ్ తప్పుకో నేను గోవా పోలీస్ ఆఫీసర్ కొడుకుని అన్నాడు. .స్కూటర్ మీదున్న వ్యక్తి చిన్నగా నవ్వి నేను గోవా ముఖ్యమంత్రిని అన్నాడు. . ఒక సామాన్య ముఖ్య మంత్రి.అసెంబ్లీ కి స్కూటర్ మీద వెళతారు.ప్రోటోకాల్ ఉండదు.పోలీస్ కేస్ లలో జోక్యం ఉండదు ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి ని కేంద్ర ప్రభుత్వం మంత్రి పదవి ఇచ్చి రమ్మంది. .ఒక ముఖ్య మంత్రి తమ రాష్ట్రం నుండి కేంద్ర మంత్రిగా వెళుతున్నారంటే సంతోషించే వారే కదా ప్రజలు. .ఆయన్ని గోవా ముఖ్యమంతి పదవికి రాజీనామా చేసి కేంద్ర రక్షణ మంత్రి బాధ్యతలు స్వీకరించామని కోరినప్పుడు యావత్ గోవా కంట తడి పెట్టింది . రాజకీయ నాయకులు అంటేనే అసహ్యం జుగుప్సు ఉన్న ఈ రోజుల్లో తమ నాయకుడు తమని వదిలి కేంద్రానికి వెళుతున్నారంటే ప్రజలు కన్నీరు పెట్టారంటే ఆయన ఎంత పెద్ద నాయకుడో ఇట్టే చెప్పొచ్చు. ట్రాఫిక్ జాం ఐతే కార్ దిగేసి స్కూటెర్ పై ఉన్న వాడిని లిఫ్ట్ అడిగెస్తాడు. బడ్డీ కొట్టు లో టీ తాగేస్తాడు. ఫుట్ పాత్ పై ఉన్న బజ్జీలు తింటాడు. అదేమిటి అని అడిగితే మన పాలన గురించి బడ్డీ కొట్టు లో తెలిసినంత మరెక్కడా తెలీదు అని చిరునవ్వుతో సమాధానం ఇస్తాడు. .గోవా ముఖ్య మంత్రిగా ఒక కాన్ఫరెన్స్ కి హాజరు కావాల్సి ఉంది కార్ ఆగింది ఒక వ్యక్తి దిగి ఒక చేత్తో బాగ్ మరో చేత్తో ఫైల్స్ మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెనక సెక్యూరిటీ వచ్చారు ఎక్కడ గోవా ముఖ్య మంత్రి అని వారిని అడిగితే అదిగో ఫైల్స్ మోసుకెళుతున్న వ్యక్తే మా ముఖ్యమంత్రి అని చెప్పరాట సెక్యూరిటీ.తీరా లోపలికెళ్లాక ఆ స్టార్ హోటెల్ గేట్ వద్ద ఉన్న వ్యక్తి ఎవరు మీరు లోపలికి వెళుతున్నారు అని ఆపేశారట వెనక నుండి సెక్యూరిటీ వచ్చి మా ముఖ్య మంత్రి అని చెబితే అవాక్కయ్యడట .అంతటి మంచి వ్యక్తి తమ రాష్ట్రం నుండి వెళుతుంటే బాధ తో కన్నీరు పెట్టారంటే నమ్మలేము ఆ వ్యక్తి ఎంతటి ధనికుడో మీరే చెప్పాలి.అవును ఈ ఉపోద్గతామంతా రక్షణ మంత్రి మనోహర్ పరికర్ గారి గురించి. . అత్యంత పేద కుటుంబం నుండి వచ్చి IIT పట్టా పొందిన పరికర్.⁠⁠⁠⁠

న్యూస్ సోర్స్ బై ..మై ఫ్రెండ్ అండ్ సీనియర్ రిపోర్టర్

]]>