తన కంపెనీ బాస్‌కు తన నగ్న వీడియోలను పంపడమే కాకుండా.. స్నేహితురాలి నగ్న వీడియోలనూ గుట్టుగా వాట్స్ అప్ ద్వారా చేరవేసి పవిత్రమైన స్నేహానికే మచ్చ తెచ్చిందా యువతి! అనుమానం వచ్చిన బాధిత యువతి తెలివిగా ఈ వ్యవహారాన్ని బట్ట బయలు చేసింది దీంతో ఆ కిలాడీ లేడీ అడ్డంగా బుక్కయింది. ఈ ఘటన కూకట్పల్లి అడ్డగుట్ట సోసైటీలోని ఓ లేడీస్ హాస్టల్లో జరిగింది. ఈ కేసులో హైమా కన్సల్టెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ శివయ్యను, ఆ సంస్థలో టెలికాలర్‌గా పనిచేస్తున్న యువతిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.
స్నేహానికి, నమ్మకానికి మచ్చ ఈ ఘటన
ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం… నిందితురాలిది కడప జిల్లా జమ్ములమడుగు. హైమా కన్సల్టెన్సీలో విధులు నిర్వహిస్తోంది. గతంలో బాధిత యువతి కూడా ఆ సంస్థలోనే పనిచేసింది. ఆ సమయంలోనే ఇరిద్దరికీ స్నేహం ఏర్పడటంతో మరో యువతితో కలిసి ముగ్గురు కూకట్‌పల్లిలోని ఓ హాస్టల్లో వుంటున్నారు .
బాధిత యువతి ఫార్మా ఎగ్జిక్యూటివ్‌గా మరో సంస్థలో చేరింది.పాత కంపెనీ బాస్ మేనేజింగ్ డైరెక్టర్ శివయ్యతో నిందితురాలికి సన్నిహిత సంబంధం ఉంది. శివయ్య కోరినట్లుగా బట్టలు మార్చుకొనే సమయంలో తన నగ్న చిత్రాలు, వీడియోలను ఆమె వాట్స్ అప్ ద్వారా పంపించేది. ఇదిలా ఉండగా ఏ ఫోటోలు చాలవన్నట్టు హాస్టల్లోని మిగతా యువతుల నగ్న చిత్రాలు, వీడియోలనూ పంపించాలని ఆమెను వేధించాడు దీంతో తన స్నేహితురాలు దుస్తులను మార్చుకుంటున్న సమయంలో వీడియోలను తీసి శివయ్యకు వాట్స్‌పలో షేర్ చేసింది.
ఆదివారం కూడా ఇలాగే గుట్టుగా చిత్రీకరిస్తుండగా.. బాధితురాలికి అనుమానం రావడంతో ఆమె ఫోన్‌ను చెక్ చేసింది. అందులో అన్నీ నగ్నచిత్రాలు, వీడియోలు ఉండటంతో కంగుతింది. నిందితురాలి ల్యాప్‌టా్‌పను పరిశీలించగా.. అందులోనూ నగ్న వీడియోలు ఉన్నాయి. దీంతో బాధితురాలు.. కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు శివయ్యను, యువతిని అదుపులోకి తీసుకుని సైబర్ క్రైం పోలీసులకు అప్పగించారు. నిందితుల నుంచి మూడు సెల్ఫోన్లు, ఒక లాప్టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితురాలు అదే హాస్టల్ల్లోని మరో యువతి పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతాను క్రియేట్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది..నమ్మకం గా ఉంటూనే ఇలా మిత్రద్రోహానికి పూనుకోవడం వంటి చర్యలను చూస్తే “స్నేహం నమ్మకం మీద కూడా అపనమ్మకం ఏర్పడుతుంది ద్రోహుల వల్ల.
]]>