ఫాన్స్ మీకో కౌగిలింత అంటున్న రాంగోపాల్ వర్మ ట్వీట్

దర్శకుడు రాంగోపాల్ వర్మకు, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు మధ్య చెలరేగిన వివాదం తారాస్థాయికి చేరింది. పవన్ ఫ్యాన్స్‌కు మద్దతుగా బండ్ల గణేష్ కూడా కొన్ని ట్వీట్లు పెట్టడంతో ఈ వివాదం మరింత రాజుకుంది. బండ్ల గణేష్‌ ట్వీట్లు, దానికి వర్మ కౌంటర్లు ఇవ్వడం ఇలా అలుపు లేకుండా ట్వీట్ ల యుద్ధం జరుగుతోంది.

tweet
తాజాగా కొందరు పవన్ ఫ్యాన్స్ వర్మను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా యాంటీ క్యాంపెయిన్‌కు దిగారు. కొందరు ఫాన్స్ ఏం చేసారంటే ఒకడుగు ముందుకేసి వర్మ చనిపోయినట్లు ఫోటోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హఠాత్తుగా మరణించిన రాంగోపాల్ వర్మ అని హెడ్డింగ్ పెట్టి.. సినీ పరిశ్రమకు పట్టిన పీడ తొలగిపోయిందని హర్షం వ్యక్తం చేస్తున్న పలువురు సినీ ప్రముఖులు.. ఆనంద భాష్పాలతో వీడ్కోలు చెప్తూ నివాళులు అర్పిస్తున్న సినీ ప్రపంచం అని ఓ ఫోటోను పోస్ట్ చేశారు.
tweet1
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ఫోటో వర్మ కంట్లో పడింది. ఇక వర్మ ఊరుకుంటాడా… తన ట్వీట్లకు పని చెప్పాడు. ముందుగా ఈ ఫోటో పెట్టినందుకు పవన్ ఫ్యాన్స్‌కు థ్యాంక్స్ చెబుతున్నట్లు వర్మ ట్వీట్ చేశాడు. లవ్ యూ టూ మై డియర్ స్వీట్ డార్లింగ్ బ్యూటిఫుల్ క్యూట్ పీకే ఫ్యాన్స్ అని ఫోటోను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. అంతేనా కొందరు గొర్రెల్లాంటి మూర్ఖులకు తాను మూడు జన్మల క్రితమే పుట్టానని.. ఇప్పుడు బ్రతికున్నది తన ఆత్మ అని తెలియడం లేదని వర్మ ట్వీట్ చేశాడు. ఆత్మలకు చావు లేదని… ఎందుకంటే అవి ఎప్పటికీ చావులోనే బతుకుతాయని వర్మ ట్వీట్ చేశాడు.మూడు ముక్కల్లో భగవద్ గీతను రాసేసాడు ఈ ధూళిపాళ క్రిష్ …
]]>