వాకాటి ఒంటరి పోరాటం…

నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన వాకాటి నారాయణ రెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని వాటిని చెల్లించకపోవడంతో ఆయన ఆస్తులు, కంపెనీలపై ఇటీవలే సీబీఐ దాడులు చేసింది. దీంతో వాకాటిని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేశారు.

వాకాటి ప్రమాణ స్వీకారోత్సవానికి టీడీపీ నేతలు ఎవరూ రాలేదు. వాకాటితో పాటు శత్రుచర్ల విజయరామరాజు చేత మండలి చైర్మణ్ చక్రపాణి ప్రమాణం చేయించారు.ఈ సందర్భంగా వాకాటి మాట్లాడుతూ తను సస్పెండ్ చేస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన చంద్రబాబు, లోకేష్ లను కృతజ్ఞతలు తెలియజేసారు.మళ్లీ టీడీపీ, చంద్రబాబుతో కలిసి పనిచేస్తానని అన్నారు. బ్యాంకు రుణాల చెల్లింపులో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించిన వాకాటి.. రెండు మూడు నెలల్లో అంతా సర్దుకుంటుందని చెప్పారు.

]]>