గిట్టుబాటు ధరకు శాశ్వత పరిష్కారం కే సిఆర్

తెలంగాణ రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధరకు శాశ్వత పరిష్కారం కల్పిస్తామన్నారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.వచ్చే బడ్జెట్‌లో 500 కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేస్తామన్నారు.భవిష్యత్తులో రైతు కమిటీల ఆధ్వర్యంలో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం జరిగేలా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ అన్నారు.

వచ్చే ఏడాదిన్నర కాలంలో వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ అందిస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్‌. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల పామాయిల్ రైతులు కలిశారు. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.వాటి పరిష్కారానికి సాయం చేయాలని రైతులు సీఎంను  కోరారు.

]]>