నియోజకవర్గాలు పెరుగుతాయి..వెంకయ్యనాయుడు

నిన్న నియోజక వర్గాల పెంపు లేదన్న కేంద్రం అప్పుడే మాట మార్చేసింది తాజా పార్లమెంట్ సెషన్స్ లోనే నోట్ ఫైల్ ను ప్రవేశ పెడతామని అంటోంది .ఇదిలా ఉండగా నిన్న మంత్రి  హన్స్ రాజ్  సమాధానం తో తీవ్ర గందరగోళనికి  అటు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రజలు గురయ్యారు .దీంతో ఈ  విషయం లో కలగ జేసుకొన్న మంత్రి వెంకయ్య నాయుడు రాజనాధ్ సింగ్ తో చర్చలు జరిపి  పరిస్థితిని కుదుట పరిచారు

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ప్రక్రియ ఖాయమని స్పష్టమైంది. విభజన చట్టంలో ఇచ్చిన హామీ అమలు దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. నియోజకవర్గాల పెంపు ప్రక్రియకు ‘గ్రీన్‌ సిగ్నల్‌’ ఇచ్చేందుకు వీలుగా కేంద్ర హోంశాఖలో కీలకమైన కేబినెట్‌ నోట్‌ సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేసారు . అంతకుముందు టీఆర్‌ఎస్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ‘నియోజకవర్గాల పెంపు ప్రక్రియను చేపట్టలేం’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారాం లోక్‌సభకు తెలిపారు. ‘‘ఏపీ విభజన చట్టం ప్రకారం, తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను 119 నుంచి 153కి పెంచాలని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిన  విషయం తెలిసిందే .

ఇదిలా ఉండగా  అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర న్యాయ శాఖ అటార్నీ జనరల్‌ అభిప్రాయాన్ని తీసుకుందట కేంద్రం  అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు, పునర్విభజన ప్రక్రియను 2026 వరకూ చేపట్టకుండా రాజ్యాంగంలో ఆర్టికల్‌ 170 (3)ని ప్రవేశపెట్టినందున, అప్పటి వరకూ అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేర్పులు కుదరవని ఏజీ తన నివేదికలో స్పష్టం చేశారు. 2021లో వచ్చే జనాభా లెక్కల ఆధారంగా, 2026 తర్వాతే అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలను పెంచాల్సి ఉంటుందని తెలిపారు. ఏపీ, తెలంగాణల్లో అసెంబ్లీ స్థానాలను పెంచుకోవడానికి విభజన చట్టం అనుకూలంగా ఉన్నా… రాజ్యాంగం మాత్రం అనుమతించదు. ఇదే మాట నిన్న హన్స్ రాజ్ సభలో చెప్పారని వెంకయ్య అన్నారు. అసెంబ్లీ  స్థానాలను ఏపీ‌లో 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచుకునేందుకు విభజన చట్టంలోనే వెసులుబాటు కల్పించారు.దీంతో పెంపు అనివార్యం ,ఇదిలా ఉండగా ఇప్పటికే తెలుగుదేశం , తెలంగాణా  రాష్ట్ర సమితి పార్టీలు నిండిపోయి వున్నాయి నియోజకవర్గాల పెంపు తక్షణ రాజకీయ అవసరంగా మారింది ఆ పార్టీలకు . అసెంబ్లీ సీట్లు పెంచాలంటూ కేంద్రంపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో… అసెంబ్లీ స్థానాల పునర్‌ వ్యవస్థీకరణకు అవసరమైన ‘పరిపాలనాపరమైన నివేదిక’ ఇవ్వాలని కోరుతూ కేంద్ర న్యాయశాఖ నుంచి ఇప్పటికే ఇరు రాష్ట్రాలకు ఒక వర్తమానం అందింది. 2019 ఎన్నికల్లోపే సీట్లు  పెరగడం ఖాయం ..
]]>