ఒక వాట్సప్ మెసెజ్..144 సెక్షన్ విదించేవరకు వచ్చింది…

ఒక ఆకతాయి చేసిన పని రెండు వర్గాల మద్య చిచ్చు పెట్టింది.ఒక వాట్సప్ మెసెజ్ పెద్ద గందర గోళమే సృష్టించింది.ఒక వర్గాన్ని దుషిస్తూ పెట్టిన వాట్సప్ మెసెజ్ పోలీస్ లకు సైతం దెబ్బలు తగిలి 144 సెక్షన్ విదించేవరకు వచ్చింది…వివరాల్లోకి వెళ్తే…ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. ఓ యువకుడు వాట్సప్‌లో ఓ వర్గాన్ని కించపరుస్తూ 8 నిమిషాల పాటు ఉండే మెసేజ్ ని పోస్టు చేశాడు.తమ వర్గాన్ని కించపరిచిన యువకుడిని అరెస్టు చేయాలని ఆ వర్గం వారు రోడ్లపై ఆందోళనకు దిగారు. అదే సమయంలో అవతలి వర్గం వారు కూడా పెద్ద సంఖ్యలో గుమిగూడి ఆందోళనకు దిగారు.వారికీ పోలీసులు సర్ది చెప్పడానికి ప్రయత్నించిన వినక పోవాడం తో వారిని చెదర గొట్టేందుకు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు.దీంతో రెచ్చిపోయిన రెండువర్గాల వారు రాళ్లు విసురుకోవడంతో కొంతమంది పోలీసులతో పాటు మరికొంత మంది ప్రజలకు గాయాలయ్యాయి. ఉన్నట్టుండి చెలిరేగిన ఈ హింసతో ఉట్నూరు మండల కేంద్రంలో దుకాణాలు మూతపడ్డాయి. ప్రస్తుతం ఉట్నూరులో 144 సెక్షన్‌ అమలులో ఉంది.అల్లరి మూకలు జరిపిన దాడిలో జిల్లా ఎస్పీ, డీఎస్పీలకు కూడా గాయాలయ్యాయి. కలెక్టర్‌ బుద్ధ ప్రసాద్‌ ఆదేశాల మేరకు డీఐజీ రవి వర్మ సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అల్లరిమూకలు పోలీసులపైకి రాళ్లురువ్వడానికి గర్హించిన ఆయన.. తప్పు చేసిన ఎవ్వరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

]]>