ఏదైనా సాధించాలనే తపన ముందుకి తీసుకెళ్తే అందుకు తగిన కృషి పట్టుదల ఉంటె ఎంతటి వారైనా విజయం సాధించవచ్చి అనేందుకు ఉదాహరణ ఈ కధనం.. దేశానికి మధ్య లో ఉన్న మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ మహిళ నేటి మహిళలకు ఆదర్శం ఆమె సాధించిన విజయం ఆదర్శనీయం..రెండు పదుల వయసు దాటాక ముందే వివాహ జీవితం లో అడుగు పెట్టిన ఆయువతి దాదాపు జీవితాన్నే మర్చిపోయే పరిస్థితి ని చవి చూడాల్సి వచ్చింది ఐనా తన కృషి పట్టుదలే జీవితం లో ఎదురైన ఇబ్బందుల్ని సమర్ధవంతం గా ఎదురుకొని విజయాన్ని సాదించేందుకు సహకరించాయి..చదవండి ..
ఆమె పేరు అనిత ప్రభ. మధ్యప్రదేశ్ రాష్ట్రం అనుప్పుర్ జిల్లా కోట్మా అనే గ్రామంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు అనితను కేవలం ఇంటర్ వరకు మాత్రమే చదివించగలిగారు. దీంతో ఆమెకు 17వ ఏటే పెళ్లి చేశారు. ఆమె భర్త ఆమె కన్నా 10 ఏళ్లు పెద్ద. అయినా అత్తింట్లో అనిత ఎప్పుడూ అందరితో సరిగ్గానే మెలిగేది. అయితే ఆమెకు తల్లిదండ్రులు హడావిడిగా పెళ్లి అయితే చేశారు కానీ, ఆమెకు చదువుపై ఇంకా ఆసక్తిగానే ఉండేది.
చిన్న వయస్సులోనే పెళ్లయిన యువతులకు సంసార జీవితం సజావుగా సాగితే బాగానే ఉంటుంది. కానీ ఒకవేళ భర్త, అత్తింటి వారు ఇబ్బందులు పెడితే మాత్రం అలాంటి యువతులకు జీవితం నరకంగా మారుతుంది. ఇలాంటి సందర్భాల్లో సరిగ్గా చదువుకోని వారికైతే ఏం చేయాలో అర్థం కాదు. జీవితాన్ని అలాగే గడుపుతారు. ఏదో ఒక రోజు వారి కన్నీటి గాథ ముగుస్తుంది.కానీ అనిత ఆలా కాదు ..

చిన్న వయసులో పెళ్లైంది. చదువుకు, తల్లిదండ్రులకు దూరమయింది. అదనపు కట్నం కోసం అత్తామామలు నరకం చూపడం మొదలుపెట్టాడు. ఇలా అయితే కష్టం అనుకుని భర్తక డైవర్స్ ఇచ్చింది. బతకాలంటే ఏదో ఒక పనిచేయాలి కాబట్టి, బ్యూటీ పార్లర్లో ఉద్యోగం చేసింది. పని చేసుకుంటూనే డిగ్రీ పూర్తి చేసింది. 2013లో ఫారెస్ట్ గార్డ్ పరీక్షలు రాసి పాసైంది. ఆ ఉద్యోగం చేసుకుంటూ ఎస్ఐ పరీక్షల రాసింది. కానీ దేహదారుడ్య పరీక్షల్లో ఫెయిలయింది. రెండో సారి ఆ పరీక్షల్లోనూ పాసయింది. ఎస్సైగా బాధ్యతలు చేపట్టింది. ఉద్యోగం చేస్తూనే ఉన్నతంగా బతకాలనుకుంది. మధ్యప్రదేశ్ స్టేట్ పబ్లిక్ కమిషన్ పరీక్ష రాసి మొదటి ప్రయత్నంలోనే 17వ ర్యాంక్ సాధించింది. డీఎస్పీ పోస్టింగ్ లభించింది. అక్కడితోనే ఆగలేదు.. గ్రూప్ పరీక్షలు రాసింది.
చిన్న వయస్సు నుండే మంచి పట్టు ఉన్న అనిత పదోతరగతిలోనే 10thగ్రేడ్ (92శాతం)మార్కులు సొంతం చేసుకుంది. అంతటితో ఆగకుండా చదువుకోవాలనే కోరిక ఆమెలో బలంగా ఉండేది. ఆ లక్ష్యంతోనే పెళ్లి తర్వాత కూడా చదువు కొనసాగించింది. భర్త అనుమతి తీసుకుని డిగ్రీ చదవడం మొదలు పెట్టింది.అత్తింట్లో వేధింపులు ఎదురయ్యాయి. వాటిని అలాగే భరిస్తూ వచ్చింది. దీంతో ఆమె చదువు కూడా సరిగ్గా సాగలేదు. చివరకు వేధింపులు ఎక్కువవడంతో భర్తకు ఆమె విడాకులు ఇచ్చింది.సొంత కాళ్లపై నిలబడాలని, ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించింది. ఆపేసిన డిగ్రీ చదువును మళ్లీ కొనసాగించింది. అందుకోసం ఆమె సొంతంగా ఓ చిన్నపాటి బ్యూటీ పార్లర్ పెట్టుకుంది. ఓ వైపు అందులో పనిచేసుకోవడం, మరోవైపు డిగ్రీ చదవడం కొనసాగించింది.

అలా అనిత ప్రభ డిగ్రీ పూర్తి చేసి 2013లో ఫారెస్ట్ గార్డ్ పరీక్ష పాసైంది. అందులో బాధ్యతలు చేపట్టాక మళ్లీ పోలీస్ ఎస్ఐ పరీక్ష రాసింది. అయితే దేహదారుడ్య పరీక్షల్లో ఫెయిలైంది. అయినా పట్టు విడవలేదు. రెండో సారి మళ్లీ పరీక్ష రాసి అందులో పాసై, దేహదారుఢ్య పరీక్షల్లోనూ సక్సెస్ అయింది. ఆ తరువాత పోలీస్ ఎస్సైగా బాధ్యతలు చేపట్టింది.
పోలీస్ డిఎస్పీ పోస్టింగ్ తో ఆమె ఆశ ఆగలేదు..ఇంకా ఏదో సాధించాలి? అనంతరం మధ్యప్రదేశ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి మొదటి ప్రయత్నంలోనే 17వ ర్యాంక్ సాధించింది. ఈ క్రమంలో ఆమెకు పోలీస్ డీఎస్పీ పోస్టింగ్ లభించింది. అయితే ఆమె ఇంకా అక్కడితో ఆగలేదు. మరో పరీక్ష రాసింది డిప్యూటీ కలెక్టర్ పోస్టు కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష రాసింది ఇప్పుడు దాని ఫలితం కోసం ఇప్పుడామె ఎదురు చూస్తోంది. విజయానికి ఆడ,మగ అనే తేడా లేదు మనలో ఉండే దీక్ష పట్టుదలే పెట్టుబడి..ఆపై విజయం మీ సొంతం ..]]>