ఆధార్ ఉంటేనే ఇకపై ..తెలంగాణాలో మొదలైన ఆధా(ర్ )రిత ల్యాండ్ రిజిస్ట్రేషన్

ఆధార్ కార్డు ఉంటేనే ఇకపై ఏదైనా తెలంగాణా లో రిజిస్ట్రేషన్ల శాఖ సర్వర్‌కు ఆధార్ సర్వర్‌ను లింకు చేయడం ద్వారా దొంగ రిజిస్ట్రేషన్లకు, బినామీ రిజిస్ట్రేషన్లకు చెక్ పెట్టడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు.ఈ రకమైన ఆధార్ విధానాన్ని మల్కాజ్‌గిరి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో  ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.

ఈ ప్రయోగం సక్సెస్ అయితే  రాష్ట్రవ్యాప్తంగా అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఆస్తుల క్రయ, విక్రయాలకు సంబంధించిన డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌కు ఏదైనా పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, పాస్‌పోర్ట్, రేషన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ గుర్తింపు కార్డులలో ఏది ఒకటి ఉన్నా సరిపోతుంది ఆస్తుల కొనుగోలుదారులు, అమ్మకం దారుల వద్ద ఎలక్ట్రానిక్ వేలిముద్రలు, ఎలక్ట్రానిక్ ఫొటోలు తీసుకుంటున్నారు. దీనితో పాటు ఇద్దరు సాక్షుల ఫొటోలను, వేలిముద్రలను కూడా రికార్డు చేస్తున్నారు.

ఒకరి పేరు మీద మరొకరు రిజిస్ట్రేషన్ చేసి మోసగించిన ఉదంతాలు తరుచూ వెలుగుచూస్తున్నాయి. బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ తరహా  మోసాలను పూర్తిస్థాయిలో అరికట్టడానికి ఆధార్‌కార్డును తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది  ఒకరి ఆధార్ కార్డు పై మరొకరు రిజిస్ట్రేషన్ చేసే అవకాశముండదు. ఈ ప్రయోగం  విజయవంతమైతే ప్రస్తుత విధానానికి స్వస్తి చెప్పే అవకాశం వుంది ..

]]>