అన్నా డిఎంకే లో చీలిక?

అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం పార్టీలో చీలికలు, రాబోతున్న సంకేతాలు దాదాపుగా ఖాయం అయినట్లే కనిపిస్తోంది.గంట క్రితం వరకు ఎటువంటి చీలికలు,మార్పులు లేవని అనుకుంటున్న సమయం లో శశి స్థానంలో తమిళనాడు ముఖ్యమంత్రి గా సూచించబడిన పళనిస్వామి, గవర్నర్ ని  కలవడం ప్రభుత్వం ఏర్పాటు కు ఆహ్వానించవలసిందిగా తమ సభ్యుల సంఖ్యతో కూడిన జాబితాను అందజేయడం,ఇలా జరిగిన విషయం తెలిసిందే ,సుప్రీం కోర్ట్ తీర్పు మేరకు పరప్పణ జైలు కు బయలుదేరిన గంటలోపే శశికళ పై కిడ్నాప్ కేసు నమోదు కావడం. పార్టీ ఉప కార్య దర్శి గా గతం లో జయలలిత ద్వారా పార్టీ నుండి సస్పెండ్ ఐన శశికళ అక్క కొడుకు దినకరన్ కు బాధ్యతలు అప్పగించడం పట్ల సీనియర్లలో అసంతృప్తి రగలడం,ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శశి క్యాంపు నుంచి బయటకు రావడం, ఆమె పట్ల ఉన్న వ్యతిరేకతకు అద్దం పట్టేలా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఇదిలాఉండగాశశికళజైలుశిక్ష అనుభవించేందుకు వెళ్లే ముందు, జయలలిత సమాధి వద్ద శపథాలు చేయడం ప్రాదాన్యతను సంతరించుకున్న విషయం తెలిసిందే. ఇలా శపథం చేయడం ద్వారా గంభిరతను సంతరించుకున్న పరిస్టితులన్నీ ఒక్కసారి గా ఆమె చెన్నై నుంచి అడుగుబయట పెట్టడం తోనే మరిపోతున్నాయి. దీనిని బట్టి చుస్తే అన్నాడిఎంకే పార్టి శశికళ కుటుంబ పార్టిగా మారిపోతుందనే ఉహాగానాలుకు ఊతమిచ్చినట్టు అవుతుంది. ఇదే పరిస్టితి కొనసాగితే అన్నడిఎంకే చీలిపోయే అవకాశాలే …….

]]>