యు ట్యూబ్ లో ఆ యాడ్స్ రావా !

యూట్యూబ్‌లో వీడియోలు చూస్తున్న సమయంలో కొన్ని ప్రకటనలు వస్తుంటాయి. ఆ ప్రకటనల్లో కొన్నింటినీ మనకు వాటిని చూడటం ఇష్టం లేకపోతే 5 సెకన్ల తర్వాత తొలగించే అవకాశం ఉంది. కొన్ని ప్రకటనలు మాత్రం చచ్చినట్లు 30 సెకన్ల పాటు చూడాల్సిందే. ఆ యాడ్ పూర్తయిన తర్వాతే మనం చూస్తున్న వీడియో కంటిన్యూ అవుతుంది ఎలా ఇబ్బంది పెడుతున్న ఈ తరహా యాడ్స్‌కు సంబంధించి యూట్యూబ్ యాజమాన్యం యూజర్లకు శుభవార్త చెప్పింది. 2018 నుంచి ఈ యాడ్స్ యూట్యూబ్‌లో కనిపించవట.ఐతే ఇక్కడ చిన్న లాజిక్ అప్లై చేసారు అదేంటంటే కేవలం గూగుల్ క్రోమ్‌లో, గూగుల్‌ సెర్చ్ ఇంజన్‌లో యూట్యూబ్‌ను వీక్షించేవారికి మాత్రమే ఈ యాడ్స్ కనిపించవు.యూజర్ల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ తెలిపింది. ప్రకటనదారులకు, యూజర్లకు మధ్య సంబంధాన్ని కొనసాగిస్తూ మరో కొత్త విధానాన్ని అమల్లోకి తేవాలని గూగుల్ భావిస్తోంది. ఆరు సెకన్ల బంపర్ యాడ్స్‌ను, 15 నుంచి 20 సెకన్ల యాడ్స్‌ను వీటి స్థానంలో అందుబాటులోకి తేవాలని గూగుల్ భావిస్తోంది. యూట్యూబ్‌లో ఇలా 30 సెకన్లు నిరంతరాయంగా యాడ్స్ రావడం వల్ల యూజర్ల సంఖ్య తగ్గుతోందని, ఓ సర్వేలో తేలిందట. అందుకే ఇదంతా ..

]]>