హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయాన్ని ఇటీవలే రెన్నోవేట్ చేసారు .బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఉన్న ఈభవనం సకల హంగులతో తీర్చి దిద్దారు . చక్కని మొక్కలతో ,కంటికి ఇంపైన ఇంటీరియర్ డిజైన్స్ తో ఈ భవనాన్ని తీర్చి దిద్దారు .ఈ భవనం లోకి ప్రవేశించిన్నప్పుడు తెలంగాణ తల్లి ,సిద్ధాంతకర్త ప్రొఫెస్ర్ జయశంకర్ చిత్ర పటాలను ఏర్పాటు చేసారు.
అంతే కాకుండా తెలంగాణ కి సంబంధించిన చిత్రకారులు, ఆర్టిస్టులు, వంటకాలు,కళలు మరియు సంస్కృతి, మాండలికాలు, జాతర్లు , పండుగలు, నీటిపారుదల ప్రాజెక్టులు మరియు రాష్ట్రాల ఆందోళన దినాలు హై లైట్స్ తో ఆకర్షణీయమైన బోర్డులతో సుందరంగా అలంకరించారు .అంతే కాదు కెసిఆర్ ఆదేశాల మేరకు మినీ పవర్ పాయింట్ హాల్ కాన్ఫరెన్స్ ,విజిటర్స్ రూమ్ ,కొత్త ఆడియో సిస్టం ఇలా సకల హంగులతో కొత్త తెరాస భవనం మెరుగులు దిద్దుకుంది .
]]>