ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో నాగసౌర్య చిత్రం

“ఊహ‌లు గుస‌గుస‌లాడే”, “దిక్కులు చూడ‌కు రామ‌య్య‌”, “ల‌క్ష్మిరావే మా ఇంటికి”, “క‌ళ్యాణ‌వైభోగం”,” జ్యోఅచ్చుతానంద‌” లాంటి విభిన్న క‌థాంశాల‌తో విజ‌యాలు సాధించిన  నాగ‌శౌర్య ఐరా క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ సినిమాలో క‌న్న‌డ‌ లో “కిరిక్ పార్టి” అనే చిత్రంలో  త‌న క్యూట్ ఫెర్‌ఫార్మెన్స్ తో అంద‌రి మ‌న‌సులు దొచుకున్న ర‌ష్మిక మండ‌న్న‌ హీరోయిన్ గా తెలుగులో పరిచయం అవుతోంది త్రివిక్ర‌మ్ వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ లో ప‌నిచేసిన వెంకి కుడుముల ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ, ఐరా క్రియోష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మాత‌లు ఉషా మూల్పూరి, శంక‌ర ప్ర‌సాద్ మూల్పూరి లు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 10 న రామానాయుడు స్టూడియోస్ లో పూజాకార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం కానుంది. “

 
ఈ చిత్రానికి సంగీతం- సాగ‌ర్ మ‌హ‌తి, 
సినిమాటొగ్ర‌ఫి- సాయి శ్రీరామ్‌.
]]>