"ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి" సరసన ఐశ్వర్యరాయ్….

ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి..నెక్ట్స్ సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే చారిత్రక కథాంశం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నమెగాస్టార్..ప్రాజెక్ట్ ను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నాడు.చిరు సరసన బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ హీరోయిన్ గా ఉండబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి సినిమాను బాహుబలి తరహాలో మల్టీ లాంగ్వేజ్ సినిమాగా రూపొదించేందుకు ప్లాన్ చేస్తున్నారు. గతంలో పలు స్ట్రయిట్ హిందీ సినిమాలు చేసిన మెగాస్టార్, ఇప్పుడు మరోసారి బాలీవుడ్ మీద దృష్టి పెట్టాడు. బ్రిటీష్ పాలకుల మీద దండెత్తిన తొలి భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను జాతీయ స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు.రామ్ చరణ్ నిర్మాత కొణిదల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు.

]]>