నాగార్జున నిర్మాత గా అఖిల్ కొత్త మూవీ ప్రారంభం

అఖిల్ అక్కినేని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ ప్రైజస్ పతాకాల పై ‘కింగ్’  నాగార్జున నిర్మిస్తున్న భారీ చిత్రం ‘ప్రొడక్షన్ నెం : 29 ‘.  అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏప్రిల్ 2 న సాయంత్రం అక్కినేని కుటుంభ సభ్యుల సమక్షంలో ప్రారంభం అయింది. అక్కినేని ముని మనవరాళ్ళు సత్య, సాగరి క్లాప్ కొట్టగా.. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దేవుడి పటాల మీద తొలి షాట్ చిత్రీకరించారు.

చిత్ర నిర్మాత అక్కినేని ’  నాగార్జున మాట్లాడుతూ, ” ‘మనం’ టెక్నికల్ టీం వర్క్ చేస్తున్న ఈ సినిమా తప్పకుండా మరో  ట్రెండ్ సెట్టర్ అవుతుంది.” అన్నారు. ఈ చిత్రానికి  సంగీతం : అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ : పి.ఎస్. వినోద్, ఆర్ట్ : రాజీవన్ , ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, నిర్మాత : అక్కినేని నాగార్జున, రచన, దర్శకత్వం: విక్రమ్ కె కుమార్.]]>