రైతులకు వాతవరణ శాఖ హెచ్చరిక…భారి వర్ష సూచన

సూర్యుడు మండే అగ్ని గోళం ల నిప్పులు కురిపిస్తున్నాడు. సాధారణం కంటే 4 నుంచి 5డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతతో భరించలేనంత వేడి గా ఉంటుంది. గాల్లో తేమ తగ్గిపోయింది.ఎక్కడా ఒక్క జల్లు పడలేదు.వేడిగాలులు వీస్తున్నాయి. ఈ పరిణామాల క్రమంలోనే రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వానలు పడనున్నాయని స్కైమెట్  అంచనా.కొత్తగూడెం, నాగర్ కర్నూల్, జగిత్యాల, వనపర్తి, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో ఈ పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.   ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ లోనూ వానలు పడనున్నాయి. ఈ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఉండటమే కారణం అట, అదేవిధంగా ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు అవుతున్నాయి.. ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులు కూడా ఉండొచ్చని ప్రకటించింది.కాని రైతులకు కష్టమనే చెప్పాలి పంట చేతికోచ్చె టైం కాబట్టి రాబోయే రెండు రోజులు రైతులు ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని అధికారులు సూచిస్తున్నారు.

]]>