బాలయ్య సరసన చేరనున్న అమలాపాల్

అన్న,బెజవాడ,ఇద్దరమ్మాయిలతో నాన్న ,నాయక్  వంటి విభిన్న కదా చిత్రాల్లో హీరోయిన్ గా ప్రధాన భూమిక పోషించిన అమలాపాల్ ఇప్పుడు మన శాతకర్ణి బాలయ్య సరసన చేరబోతోందట బాలకృష్ణ, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌ సినిమాలో ఈ కాంబినేషన్ ఉండబోతోందని ప్రస్తుత టాక్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఇద్దరు కథానాయికలు ఉంటారట. ఇప్పటికే ఓ నాయికగా ముస్కాన్‌ని ఎంపిక చేశారు. మరో నాయిక పాత్రకు పేరున్న తారను తీసుకోవాలనుకుంటున్నారని సమాచారం. ఆ ఛాన్స్‌ అమలాపాల్‌కి దక్కిందనిఅంటున్నారు పూరి దర్శకత్వం వహించిన ‘ఇద్దరమ్మాయిలు’లో అమలా పాల్‌ నాయికగా ఆల్రెడీ నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.

ఈ మలయాళ కుట్టి నటనకు ఇంప్రెస్‌ అయిన పూరి బాలకృష్ణ సరసన క థానాయికగా ఎంపిక చేశారని కొంత గ్యాప్‌ తర్వాత తెలుగులో అమలా పాల్‌ ‘ఆయుష్మాన్‌ భవ’ అనే చిత్రం అంగీకరించారు. దర్శకుడు విజయ్‌తో వివాహ బంధానికి ముగింపు పలికిన తర్వాత ఈ బ్యూటీ కెరీర్‌పై పూర్తిగా దృష్టి పెట్టారు. అందుకే, ఇకనుంచి వరుసగా సినిమాలే  సినిమాలు తీస్తుందట]]>