అమెరికా లో దాడులే దాడులు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వలసలను అడ్డుకునేందుకు చట్టాన్ని తీసుకొచ్చినప్పటి నుండి భారతీయుల మీదే దాడులు జరుగుతున్నాయి.మొదట దాడులు చేయడం గాయపడి,ఆస్తి నష్టం జరిగి,ప్రాణాలు పోగొట్టుకున్న తర్వాత అయ్యో భారతీయులు అనొకొ లేదు అరబ్ దేశపు ముస్లిం లు అనుకున్నాం అని సమాధానం చెప్తున్నారు అమెరికన్స్ కానీ ఇదంతా .కావాలనే చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తప్పించుకోవడానికి ఇలా చెప్తున్నారో అర్ధం కావట్లేదు ఫలితం గా మన వారిని పోగొట్టుకుంటున్నాం.

తాజా గా ఫ్లోరిడాలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తుల స్టోర్‌పై రిచర్డ్‌ లాయిడ్‌ అనే 64 ఏళ్ల వ్యక్తి దుకాణానికి నిప్పుపెట్టి ఆనదించాడు.ఎందుకని పోలీస్ ల విచారణలో అడగగా ముస్లిమ్స్ అనుకున్నాను అని సమాధానం చెప్తున్నాడు.ఆ సమాధానానికి అక్కడి అధికారులకు కూడా ఒళ్ళుమండిందట దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి కోర్టుకు తీసుకెళ్లగా 30వేల డాలర్ల బాండు ఇవ్వాలని ఆదేశించడంతోపాటు జైలుకు తరలించాలని ఆదేశించింది.

]]>