వారసుల్లేక తుప్పు పడుతున్న అమ్మ ఆస్తులు …

తమిళ తల్లి గా పేరు గాంచిన జయలలిత కోట్ల రూపాయల వారసత్వాన్ని ప్రకటించకుండానే కన్నుమూసిన విషయం తెలిసిందే చిన్నమ్మ ఊచలు లెక్క పెడుతున్నవిషయం తెలిసిందే ఆ చిన్నమ్మ మేనల్లుడు దినకరన్ కూడా ఎప్పుడు అదే పనిలో ఉన్నారు నమ్మిన బంటు  వర్గ పోరులో బిజీ గా వున్నారు  కు దగ్గరగా వున్నాం అంటున్న వారందరూ దూరం గా వున్నారు .అమ్మ జయలలిత మరణం తర్వాత పోయెస్ గార్డెన్ కళావిహీనంగా మారగా ఆమె వినియోగించిన కార్లు కూడా మూలనపడ్డాయి.

ఆరు నెలలకు పైగా అలాగే ఉన్న రూ.50 లక్షల విలువైన ఆ వాహనాలు తుప్పు పడుతున్నాయి. ఆమె ఆమె వీలునామా రాయకపోవడం, వారసులం తామే అంటూ సంబంధిత పత్రాలతో ఎవరూ రాకపోడంతో ఎటూ తేలకుండా ఉంది. రెండు టయోట ప్రాడొ ఎస్‌యూవీలు, టెంపో ట్రావెలర్, టెంపో ట్రాక్స్, మహీంద్ర జీపు, మహీంద్ర బొలెరొ, స్వరాజ్ మజ్దా మ్యాక్సీ, 1990 కాంటెస్సా, 1980 నాటి అంబాసిడర్ పోయెస్ గార్డెన్‌లోని వాహనాల్లో ఉన్నాయి. చట్టప్రకారం ఏదైనా వాహనం యజమాని మరణిస్తే, వారసులు ఆ విషయాన్ని ఆర్‌టీవోకు తెలియజేసి, తన పేర రిజిస్ట్రేషన్‌ను బదిలీ చేయించుకోవాలి. ఇది మూడు నెలలోపు జరగాలి. గత ఏడాది డిసెంబరు 5న జయలలిత కన్నుమూశారు. అంటే రిజిస్ట్రేషన్ బదిలీ గడువు ఎప్పుడో ముగిసింది.అందుకే అనుకుంట పెద్దలు ఎప్ప్పుడో చెప్పారు వారసత్వం ఉండాలని ..రాజుల సొమ్ము రాళ్ల పాలని .

]]>