ముఖ్యమంత్రి చంద్రబాబుకి దేవుడి ఆదేశం ..ఇదే

‘‘కొంతమంది అడ్డంకులు సృష్టించడంతో ఆలస్యమైనా ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ  రాజధాని ప్రాంత స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు.. న్యాయస్థానాలకు వెళ్లడం, పదే పదే ఆటంకాలు కల్పించడం, అవినీతి ఆరోపణలు చెయ్యడంతో విలువైన సమయాన్ని కోల్పోయాం కానీ సంకల్ప బలం ఉండటంతో మళ్లీ ఈ ప్రాజెక్టును ప్రారంభించగలిగాం…’’అని ఏపీ ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు అన్నారు .

ఎన్నికల ప్రచారంలో హెప్పినట్టుగానే  సింగపూర్‌ లాంటి రాజధాని నగరాన్ని నిర్మించబోతూ అనుమానాలకు సమాధానం చెప్పబోతున్నాం రైతుల త్యాగంతోనే ఇది సాధ్యపడిందని  గుంటూరు జిల్లా మందడంలో స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టుకు సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమం లో అయన మాట్లాడుతూ  అప్పట్లో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లకు తోడు సైబరాబాద్‌ను నిర్మించానని,

దేవుడు చెప్పాడు చంద్రబాబు చేస్తున్నాడు 

అమరావతిని నిర్మించమని ఆ దేవుడే తనను దేవుడి ఆదేశించినట్టు గా భావిస్తానని  రాజధాని అభివృద్ధి చేస్తామని ముందుకొచ్చే ప్రభుత్వాలకు, ప్రభుత్వ రంగ సంస్థలకు సింగపూర్‌ కంపెనీల తరహాలో భూమిని కేటాయించి వారిని ప్రోత్సాహాన్నిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం గా ఉందని చంద్రబాబు చెప్పుకొచ్చారు .

నిధుల సేకరణ లో 9 పద్దతులు

తొమ్మిది తరహాల్లో నిధులు సమీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

భూమి తనఖా, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులు, ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఎన్‌డీబీ క్యాపిటల్‌ లిమిటెడ్‌ వంటి సంస్థల నుంచి వివిధ రూపాల్లో నిధుల సమీకరణ, పబ్లిక్‌, ప్రయివేటు భాగస్వామ్యం  బీమా సంస్థల నుంచి దేశీయ రుణ సమీకరణ, పెన్షన్‌ నిధులు, ఇన్‌ఫ్రా నిధుల వంటి ఈక్విటీ ఫండ్ల ద్వారా నిధుల సమీకరణ అంతే కాదు అంతర్జాతీయంగా రుణాల సమీకరణ, ఎన్‌ఆర్‌ఐ బాండ్లు, గ్రీన్‌ బాండ్లు, మసాలా బాండ్ల ద్వారా నిధులు సమీకరించి అమరావతిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక ను సిద్ధం చేసుకొంటున్నట్టు అయన చెప్పారు .

అమరావతిలో నిర్మించబోయే ‘స్టార్టప్‌ ఏరియా’ కోసం 15ఏళ్లలో మొత్తం రూ.3వేల కోట్ల భారీ పెట్టుబడి పెడుతున్నట్లు అసెండాస్‌ సింగ్‌బ్రిడ్జి ముఖ్య కార్యనిర్వహణాధికారి సంజయ్‌దత్‌ తెలిపారు.విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విశేషాలను వివరించారు. ‘‘ అనుభవజ్ఞులు, స్థానికంగా లభించే నైపుణ్యాలను ఉపయోగించుకుని అవసరమైన మౌలికసదుపాయలు కల్పిస్తాం. ముందుగా స్థానికంగా ఎదురయ్యే సవాళ్లు, ఉన్న సానుకూలతను అధ్యయనం చేస్తాం. ఇక్కడికి వచ్చే స్టార్టప్‌ సంస్థల ద్వారా కూడా పెట్టుబడులు వస్తాయి. వ్యాపార సంస్థలు, ఇతర సంస్థలు, విదేశాల్లోని వ్యాపార సంస్థలు అందర్నీ ఆకర్షించేలా ఈ స్టార్టప్‌ ఏరియాను అభివృద్ధి చేయాలనే లక్ష్యం తో ముందుకు వెళ్లనున్నట్టు తెలిపారు .

]]>