వైవాహిక జీవితంలో అడుగిడుతున్న "జర్నీ"జంట

ఫ్రెండ్స్ అని చెప్పుకున్న‌వారే పెళ్లికి సిద్ధ‌ప‌డ‌తారు రహస్యం గా  కాపురాలు  కూడా చేస్తారు. ఇది సెల‌బ్రిటీల విష‌యంలో ఐతే చెప్పే అవసరమే లేదు సరిగ్గా అలన్తి సెలబ్రిటీ లే ఇప్పుడు వైవాహిక జీవితం లో అదును పెట్ట బోతున్నారు  షాపింగ్ మాల్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన‌ప్ప‌టికీ..జ‌ర్నీసినిమాతో పాపుల‌ర్ అయ్యింది అంజ‌లి. అదే సినిమాలో జై కు జోడీగా న‌టించింది. ఆ స‌మ‌యంలోనే ఇద్ద‌రి స్నేహం చిగురించింది. ఆ త‌ర్వాత అది ప్రేమ‌గా …బ‌లాన్ని చేకూరుస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో ఇద్ద‌రూ త‌మ రిలేష‌న్‌పై యాక్టివ్‌గా ఉంటున్నారు.

ప్రస్తుతం అంజలి తరమణి, కాన్‌బదు పొయ్, పేరంబు, బెలూన్‌ చిత్రాలతో బిజీగా ఉంది బెలూన్‌ చిత్రంలో జై తో  కలిసి నటిస్తున్నారు కొద్దిరోజుల క్రితం ఇద్ద‌రూ కిచెన్‌లో దోశ వేసి తింటున్న ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీరిద్దరూ స‌హ‌జీవ‌నం చేస్తున్నార‌ని ఇప్ప‌టికే ప్ర‌చారం ఉంది. అంజలి జైతో ప్రేమ వ్యవహారాన్ని తన కుటుంబ సభ్యులతో చెప్పి పెళ్లికి ఒప్పించినట్లూ, జై కూడా వెంటనే పెళ్లిచేసుకుంటారట ఇద్ద‌రూ త‌మ చిత్రాల‌ను త్వరగా పూర్తి చేసుకుని వ‌చ్చే ఏడాది పెళ్లి కి పిలవనున్నట్టు తెలిసింది …

]]>