అన్నపూర్ణ మిశ్రా కేజ్రీవాల్‌ కి బహిరంగ లేఖ రాశారు…

56

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఓ అబద్ధాల కోరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కపిల్‌ మిశ్రా తల్లి, ఒకప్పటి బీజేపీ నేత అన్నపూర్ణ మిశ్రా. ఈ మేరకు అతడికి ఓ బహిరంగ లేఖను రాశారు. “ఇంకా ఎన్ని అబద్ధాలాడతావు కేజ్రీవాల్‌, కొంచెం దేవుడికైనా భయపడు.నా కొడుకు నిన్ను ప్రశ్నిస్తాడనిగానీ, ఆ ప్రశ్నలను తప్పించుకుంటావనిగానీ నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను ఎప్పుడు కలుసుకున్నా ప్రజాజీవితంలో సత్యంగా ఉండాలనే విషయాన్నే చెబుతావు. గుర్తుకు తెచ్చుకో, కపిల్‌ను నీ పార్టీలోకి తీసుకుంటానని నువ్వే నా ఇంటికి వచ్చి అడిగావు, పార్టీ తరుపున ఎన్నికల్లో పోటీ చేయాలన్నావు. కానీ కపిల్‌ మాత్రం ఉద్యమంలోనే భాగస్వామ్యం అవుతానని చెప్పాడు. కానీ, నువ్వు కపిల్‌ అవసరం తనకు చాలా ఉందని చెప్పావు. ఇప్పుడు ప్రజలంతా నిన్ను అవినీతిపరుడని అంటున్నారు.. నువ్వు మాత్రం మౌనంగా ఉన్నావని,కపిల్‌తో ఉన్నావు కానీ వాడిని అర్ధం చేసుకోలేదు. వాడు తీవ్ర బాధతో ఉన్నాడు. మూడు రోజులుగా ఏమీ తినడం లేదు. ఒక తల్లిగా నిన్ను అడుగుతున్నాను.అతడు ఏ సమాచారం అడుగుతున్నాడో అది ఇచ్చేయ్‌. అతడు ఎవరి ఏజెంటూ కాదు,ఒక్క నిజానికి తప్ప” అంటూ లేఖ రాశారు అన్నపూర్ణ మిశ్రా.

]]>