అమెరికా లో మరొక జాత్యహంకార దాడి…..

అంతకంతకు పెరుగుతున్న హత్యలు,దిక్కు తోచని పరిస్థితులలో భారతీయులు, అమెరికాలో మరో ఘోరం,జాత్యహంకార దాడే అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం. దోపిడీ దొంగల చేతిలో 26 ఏళ్ల భారతీయుడు దారుణ హత్యకు గురయ్యాడు. వాషింగ్టన్‌ రాష్ట్రంలోని యకిమా నగరంలో జరిగిన  ఘటన.

పంజాబ్‌కు చెందిన విక్రమ్‌ జర్యాల్‌.. నెలరోజుల క్రితమే అమెరికా వెళ్లాడు. ప్రస్తుతం యకిమా సిటీలోని ఏఎం–పీఎం గ్యాస్‌స్టేషన్‌లో క్లర్కుగా పని చేస్తున్నాడు.మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు విక్రమ్‌ పనిచేస్తోన్న స్టేషన్‌కు వచ్చి, డబ్బుకోసం బెదిరించారు. దీంతో విక్రమ్‌ స్టేషన్‌ కౌంటర్‌లో ఉన్న నగదును వారికి తీసి ఇచ్చాడు. అయినప్పటికీ ఆ ఇద్దరు దుండగుల్లో ఒకరు విక్రమ్‌పై కాల్పులు జరిపి,పారిపోయారు. ఇది జాత్యహంకార దాడే అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ ఘటన చుసిన కొందరు విక్రం ని హాస్పిటల్ కి తిసుకువెళ్ళగా అప్పటికే విక్రం చనిపోయాడని డాక్టార్ లు నిర్దారించారు.వెంటనే పోలీస్ లు విచారణ చేపట్టారు. ఖండించిన విదేశాంగ మంత్రి ఈ ఘటనను విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌  ఖండించారు. విక్రమ్‌ సోదరుడు ఈ ఘటనను తన ట్విటర్‌ ఖాతాద్వారా సుష్మ దృష్టికి తీసుకెళ్లారు. మృతదేహాన్ని వెనక్కి రప్పించేందుకు చేయూత ఇవ్వాలని కోరారు. కాగా విక్రమ్‌…పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌ వాసి.మంత్రిగారి ట్వీట్ ఇదే…

artfelt condolences on your brother’s tragic death. I am asking @IndianEmbassyUS to provide all help and assistance. https://twitter.com/InnocentJaryal/status/850085558282059777 ]]>