మరో సారి తండ్రి కాబోతున్న పవన్

జనసేన అదినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తండ్రి కాబోతున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.ప‌వ‌న్ మూడో భార్య‌ అన్నా లెజినోవా మ‌రో బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతుందని తెలుస్తోంది. ఇటీవ‌లే ఆమె ఓ షాపింగ్ మాల్‌లో బేబి బంప్‌తో క‌నిపించ‌డంతో ఈ వార్త‌లకు ఊత‌మిచ్చిన‌ట్టైంది. ఇదివ‌ర‌కే పవన్ – అన్నా లెజినోవాలకు ఒక కూతురు పోలనా ఉంది.ఇప్పుడు అన్నా ఇంకో బిడ్డకు జన్మనివ్వబోతోందట.

పవన్ – రేణు దాంప‌త్యంలో ఓ కుమారుడు, ఓ కుమార్తె జ‌న్మించారు. భార్యాభ‌ర్త‌ల స‌ప‌రేష‌న్ త‌ర్వాత‌ ప్ర‌స్తుతం ఆ పిల్ల‌లు రేణు వ‌ద్ద‌నే పెరిగి పెద్ద‌వాళ్ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఓవైపు జ‌న‌సేన పార్టీ స్థాపించి పూర్తిబిజీఅయిపోయినప‌వ‌న్ మ‌రోవైపు కుటుంబ బాధ్య‌త‌ల్లోనూ అంతే టైట్ బిజీ అయిపోతున్నారన్న‌మాట.

]]>