ఆంధ్రప్రదేశ్ నూతన అసెంబ్లీ ని ప్రారంభించారు.ఉదయం 11.25 నిమిషాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు.అమరావతిలో నిర్మించిన నూతన అసెంబ్లీ భవనాన్ని ప్రారంభోత్సవకార్యక్రమం లో స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు, ఏపీ మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలతో పాటు రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన పలువురు రైతులు హాజరయ్యారు. వచ్చేనెల 6 నుంచి అమరావతిలో తొలి శాసనసభ సమావేశాలు ప్రారంభం అవుతాయి.
చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఇతర పార్టీల నేతలు కూడా ప్రారంభ కార్య క్రమానికి వస్తే బాగుండేదనిఅన్నారు .గురువారం అసెంబ్లీ భవన సముదాయాలను ప్రారంభించిన ఆయన అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ… రాష్ట్రం నడిబొడ్డున రాజధాని ఉండాలనే ఇక్కడికి వచ్చామన్నారు. భూమిపై మమకారం ఉండే ప్రాంతం అయినప్పటికీ రైతులు ముందుకొచ్చి 34వేల ఎకరాలు ఇచ్చారని పేర్కొన్నారు.
అయన మాట్లాడుతున్న సందర్భంలో విభజన సమయంలో జరిగిన అన్యాయాన్ని, అవమానాలను గుర్తుచేసుకొనిచంద్రబాబు కంటతడి పెట్టారు. చంద్రబాబు ఉద్వేగంగా ప్రసంగించారు. ఏపీ అభివృద్ధి చేసుకోవాలనే కసితో ప్రస్థానాన్ని ప్రారంభించామని చెప్పారు. ఇది తాత్కాలికే అసెంబ్లీ మాత్రమేనని, త్వరలో కొత్త అసెంబ్లీని నిర్మించనున్నట్లు తెలిపారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని ఆయన అన్నారు. రాయలసీమను కోస్తా కన్నా ఎక్కువగా అభివృద్ధి చేస్తానని బాబు చెప్పారు. వనరులున్నా అభివృద్ధికి నోచుకోని ప్రాంతం ఉత్తరాంధ్ర అని, ఆ పరిస్థితిని మార్చుతామని అందుకు గాను ప్రణళిక రచిస్తున్నట్టు చెప్పారు
]]>