AP అసెంబ్లీ భవనం స్పెషల్ ఇదే…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజధాని అమరావతి లో నూతన అసెంబ్లీ ని ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ,  అమ‌రావ‌తిలో తొలి శాసనసభ సమావేశాలు ప్రారంభంఅవుతాయి.అసెంబ్లీ భవన స్పెషల్  ఫీచర్ లు ఇవే . .ap2
  • సచివాలయం ప్రాంగణంలోని రెండు ఎకరాల స్థలంలో అసెంబ్లీని నిర్మించారు.
  • ఒకే సముదాయంలోనే అసెంబ్లీ, సచివాలయాలను ఏర్పాటు చేశారు.
  • మొత్తం 260 మంది కూర్చునేలా అసెంబ్లీని నిర్మించారు.
  • 90 మంది కూర్చునేలా శాసనమండలిని నిర్మించారు.
  • అసెంబ్లీలో స్పీకర్ ఛైర్ ను అత్యంత ఆకర్షనీయంగా తయారు చేశారు. ఏడు అడుగుల ఎత్తులో స్పీకర్ ఛైర్ ను ఏర్పాటు చేశారు.
  • స్పీకర్ ఛైర్ కు ఇరువైపులా ఎల్ఈడీ స్కీన్స్ ఏర్పాటు చేశారు.
  • సభ్యుల వద్ద సెన్సార్ మైక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. దీంతో, మైకులు విరగొట్టడం కుదరదు.
  • ముఖ్యమంత్రికి, స్పీకర్ కు ప్రత్యేక సమావేశ మందిరాలను ఏర్పాటు చేశారు.
  • అసెంబ్లీలో ఐదు అత్యాధునిక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వీటిలో మీడియాకు 2, అధికారులు, వీఐపీలకు, విజిటర్స్ కు ఒక్కో గ్యాలరీ కేటాయించారు.
  • ఈ భవనాలను రికార్డు సమయంలో ఎల్ అండ్ టీ, సీఆర్డీఏలు నిర్మించాయి.
  • సచివాలయం ప్రాంగణంలో ఇప్పటికే పలు భవనాలు ఉన్నాయి. ఆరో భవనంగా అసెంబ్లీ, శాసనమండలిని నిర్మించారు.
 
]]>