శాసన సభలో నిరసనల హోరు (పోరు) జీఎస్టీ ఆమోదం

వస్తు సేవల పన్ను బిల్లు(జీఎస్టీ)కు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ప్రత్యేకంగా ఏపీ శాసనసభ, మండలి సమావేశమయ్యాయి. ఆర్థిక మంత్రి యనమల జీఎస్టీ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. సభ ప్రారంభమవ్వగానే వైకాపా ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాలుగు రోజుల పాటూ సభను నిర్వహించాలని, రైతుల సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…ఈ బిల్లు వల్ల దేశానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఒకే దేశం… ఒకే పన్ను విధానం వల్ల అంతే మంచే జరుగుతుందని అభిప్రాయపడ్డారు. దీనిని కేంద్రం చేపట్టిన విప్లవాత్మక సంస్కరణగా పేర్కొన్నారు. అనంతరం సభ ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించింది. పీవీ సింధుకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చేందుకు బిల్లులో మార్పులు చేశారు. అనంతరం ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో జీఎస్టీ బిల్లుకు ఎప్పుడో ఆమోద ముద్ర పడి న విషయం తెలిసిందే .

 ]]>