ఏపీ మంత్రి నారాయణ కొడుకు నిశిత్ ప్రమాదం లో మృతి

హైదరాబాద్ లో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కొడుకు కన్నుమూసాడు.జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36లో మెట్రో పిల్లర్ ను అతివేగంగా కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.దీంతో కారులో ప్రయాణిస్తున్న నిశిత్ నారాయణ, అతని స్నేహితుడు రాజా రవివర్మకు తీవ్ర గాయాలయ్యాయి.అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరూ చనిపోయారు.

ప్రమాద సమయంలో ఎయిర్ బెలూన్స్ తెరుచుకున్నప్పటికీ వారు ప్రాణాలతో బయటపడలేకపోయారు. మంత్రి నారాయణ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న నారాయణ కుటుంబసభ్యులు, బంధువులు అపోలో హాస్పిటల్ కు చేరుకున్నారు. మంత్రి నారాయణ వియ్యకుండు మరో మంత్రి గంటా శ్రీనివాసరావు హైదరాబాద్ కు బయలుదేరినట్లు సమాచారం.  ఈ ఏడాదే నిషిత్ నారాయణ గ్రూప్స్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు.

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, శాసన మండలి చైర్మన్ ఏ చక్రపాణి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు పితాని సత్యనారాయణ, కెఎస్ జవహర్, పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్‌, తదితరులు సంతాపం ప్రకటించారు.మంత్రి నారా లోకేశ్‌ తన ఢిల్లీ పర్యటన రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరారు.నిశిత్ మృతిపట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.మంత్రి కుటుంబానికి ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

నారాయణ కుటుంబసభ్యులకు విషాద సమయంలో బాసటగా నిలిచేందుకు మంత్రి కామినేని శ్రీనివాస్ నెల్లూరు వెళుతున్నట్టు సమాచారం.రోడ్డు ప్రమాదంలో కుమారుడిని కోల్పోయిన నారాయణ కుటుంబానికి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు.నిషిత్‌ మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి ఆవాస విభాగం అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొనేందుకు కెన్యా రాజధాని నైరోబీ వెళ్లిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రమాదం గురించి తెలియగానే నారాయణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తెలంగాణ మంత్రి హరీశ్‌ రావు దగ్గరుండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.అనంతరం భౌతికకాయాన్ని నెల్లూరు తరలించనున్నట్లు తెలుస్తోంది. రేపు నెల్లూరులో నిషిత్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.ఇప్పటికే పలువురు రాజకీయ సిని ప్రముకులు అపోలో ఆస్పత్రి కి చేరుకుంటున్నారు.సిని హీరో లు పవన్ కళ్యాణ్,చిరంజీవి ఇంకా పలువురు అపోలో ఆస్పత్రి కి చేరుకున్నారు.

]]>