రైతన్నా మీ వెంటే నేనుంటా…..కేసిఆర్

ఓరుగల్లు రొమ్ము విరిచి నిల్చుంది.ఊరు వాడ ఒక్కటైంది.వరంగల్ గులాభి మయం అయ్యింది.టిఅర్ఎస్ ఆవిర్బావ వేడుకులు ఘనం గా జరిగాయి.నాలుగు కోట్ల ఆశాద్వీపం తెలంగాణా తోలి ముఖ్య మంత్రి కల్వ కుంట్ల చంద్ర శేఖర్ రావు గారు లక్షల మంది ప్రజల కరతాళ ధ్వనుల మద్య ప్రసంగిస్తూ మూడు సంవత్సరాల పరిపాలనలో ప్రారంబించిన సక్షేమ కార్యక్రమాలను  గుర్తు చేసారు….గతం లో టీఆర్‌ఎస్‌ ఉండదని చాలా మంది అన్నారు కానీ ఇప్పుడు టిఅర్ఎస్ ఉంది అన్న వాళ్ళు పోయారన్నారు.సభలో జయశంకర్ సార్ లేక పోవడం బాధగా ఉందన్నారు.ఆయన ఎక్కడ ఉన్న ఏంతో సంతోషం గా ఉంటారు అన్నారు.ఆరునెలల్లో కోత లేని కరెంట్‌ తీసుకొచ్చాం అన్నారు.పరిశ్రమలు, గృహాలకు నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తున్నామన్నారు.

 మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టామని,వచ్చే ఏడాది పూర్తయ్యే నాటికి ఇంటింటికీ మంచినీరు అందిస్తామన్నారు. రూ. 43 వేల కోట్లతో మిషన్ భగీరథ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందన్నారు. పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్తున్నామని..ప్రతి గొల్ల, కురుమలకు 84లక్షల గొర్రెలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.ప్రతి గొల్ల, కురుమ కుటుంబానికి 21 గొర్రెలు అందిస్తామన్నారు. ఇందులో ఎలాంటి పైరవీలుండవన్నారు.సొసైటీలో సభ్యులైతే చాలు గొర్రెలను అందిస్తామన్నారు.

మత్స్య పరిశ్రమకు రూ.1000 కోట్లు కేటాయించామని.19వేల చెరువులు బాగు చేసుకున్నామన్నారు.గత ప్రభుత్వాల హయాంలో ఎరువుల కొరత ఉండేది కాని ఇప్పుడు ఎరువుల కొరత తీర్చామని ప్రకటించారు. రైతులకు రెండు పంటల కోసం పెట్టుబడి గా ఎకరానికి రూ. 4 వేల చొప్పున వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇస్తామని చెప్పారు.మే 15 లోగా మొదటి పంటకు, అక్టోబర్ 15 లోగా రెండో పంటకు నిధులు రైతుల ఖాతాలో జమ చేస్తామని ప్రకటించారు.గ్రామ రైతు సంఘాలు ఏర్పాటు కావాలని సూచించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి రైతు సంఘాలు ఏర్పడాలన్నారు.రైతు సమాఖ్యలు ఏర్పాటు చేసి రూ.500కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేస్తామని ప్రకటించారు.

తెలంగాణను క్రాప్ కాలనీలుగా విభజిస్తామని.మీరు పని చేయ్యండి మీ వెంట నేను ఉంటా అని  రైతుల కు  కేసీఆర్ భరోసానిచ్చారు. మనం పండించే పంటకు మనమే ధర నిర్ణయించే రోజు రావాలన్నారు. పట్టుబట్టి జట్టుకడితే మన పంటకు మనమే ధర చెప్పే పరిస్థితి వస్తుందన్నారు. రైతుల విషయంలో రాజీపడేది లేదన్నారు. పంటలకు విద్యుత్, నీళ్లు, పెట్టుబడి ఉచితంగా ఇస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర కర్షక సమాఖ్యకు బడ్జెట్ లో రూ. 500 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు.రూ.17 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేశామని గుర్తు చేశారు.

కాళేశ్వరం, పాలమూరు పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని తెలిపారు సీఎం. భక్త రామదాసు ప్రాజెక్టు ద్వారా 60వేల ఎకరాలకు నీరిస్తున్నామన్నారు. ప్రాజెక్టులు పూర్తయితే రాజకీయ భవిష్యత్‌ ఉండదని ప్రతిపక్షాలు భయపడుతున్నాయన్నారు. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేసులు వేస్తున్నారని మండిపడ్డారు సీఎం కేసీఆర్.

]]>