సైన్యానికి చీఫ్ గెస్టు…. ఈ బుడతడు

బోర్డర్ లో సైనికుల ఎన్ని కష్టాలు పడుతున్నారో అని తెలుసుకున్నాడు నిజాంపేటకు చెందిన నరసింహారెడ్డి, ఇందిర దంపతుల ముద్దుల కుమారుడు రవికర్ బాబు.అప్పటినుంచి సైన్యం దగ్గరకు వెళ్ళాలని తనకు కోరికట అక్కడికి వెళ్లి వాళ్ల కష్టాలు స్వయంగా తెలుసుకోవాలనుకున్నాడు. ఈ విషయం తన తల్లి తండ్రులకు చెప్పిన పట్టించుకోక పొవడం తో  తనే ఓ లెటర్ రాశాడు.తను అనుకున్న మాటలన్నీ ఆ లెటర్ లో రాసాడు.ఆ లేటర్ చదివి స్పందించిన బీఎస్ఎఫ్ జవాన్లు.అతన్ని వెతుక్కుంటూ వచ్చారు. అతన్ని తీసుకెళ్లి సైనిక శిబిరాలను చూపించారు. పిల్లాడిలోని దేశభక్తి, జవాన్లపై ప్రేమను చూసి ఎంతో ముచ్చటపడ్డారు. ఆ కుర్రాడు చదివేది నాలుగో తరగతే అయినా రవికర్ కు దేశమన్నా, జవాన్లు అన్నా ఎంతో ఇష్టం. ఆ ప్రేమే అతన్ని సైన్యానికి చీఫ్ గెస్టును చేసింది. ఇసుక ఎడారులున్న రాజస్ధాన్‌లోని మెరార్‌ను ఎంచుకున్నాడు.రాజస్ధాన్ బోర్డర్‌కు వెళ్లి వారం రోజులపాటు గడిపాడు. ధనాన, మురార్, తానోట్, బాబిలోన్ ఔట్ పోస్టులను సందర్శించాడు.

]]>